ప్రస్తావ పారిజాతం-1
--------------------------
❤విషయః - జననీ 🙏
విషయం-జనని
🌷
సంస్కృతరచన- సంకా ఉషారాణి
తెలుగు అనువాదం- పులిపాక వేంకట లక్ష్మీకాంత రావు
ఈశ్వరః న దృశ్యతే చర్మచక్షుర్భ్యామ్। లోకే సామాన్యమానవైః భగవతః ఉపస్థితిః సాక్షాన్నానుభూయతే। సః దయాలుః పిత్రోః రూపేణ భూమౌ వసతీతి విజ్ఞాః వదన్తి। తత్రాపి మాతృరూపేణ విశేషతః తిష్ఠతి సః। యా జన్మప్రభృతి అస్మాన్ పాలనపోషణాదికం కృత్వా ప్రేమ్ణా సంవర్ధయతి సా మాతా పరమపూజనీయా అస్మాభిః। తస్యాః వయం సర్వదా అధమర్ణాః ఏవ।
మాతా సర్వసఙ్గపరిత్యాగినః సన్యాసినః అపి పూజ్యా। సా స్వార్థం విసృత్య స్వహితం అవిగణయ్య సర్వదా సన్తానస్య పాలనాయ, ప్రయోజనాయ ఏవ స్వజీవనం యాపయతి।
ప్రసవసమయే, తదనన్తరమపి అత్యధిక-శరీరపీడాం సా సహతే। స్తన్యపానేన పోషయతి, సర్వాశుభైః రక్షతి। సన్తానస్య ఆనన్దే నన్దతి, దుఃఖే వ్యథితా భవతి। ప్రేమ్ణా లాలయన్తీ లోకవ్యవహారం, శుభాశుభం చ శిక్షయతి। అపరాధే కృతే ప్రథమం హితముపదిశతి। తదాపి అశ్రవణే కోపాత్ దణ్డయతి।
యది కోఽపి సన్తానస్య అహితమాచరతి, తర్హి సా అపరిమితం క్రుద్ధా భూత్వా శపతే। న కేవలం మానవేషు, అపి తు జీవకోట్యాం సర్వప్రాణిషు మాతృషు ఇదం లక్షణం దృశ్యతే।
వార్ధకే తస్యాః సేవా ఏవ పుత్రస్య పరమకర్తవ్యమ్। తస్యా పాదసంవాహనేన మనః తీర్థస్నానాచారణసమం శాన్తిం ప్రసన్నతాం చానుభవతి। తత్సేవాయాః పుణ్యకృతిర్నాన్యా లోకే॥
--సంకా ఉషారాణి
----------------------------------------
ప్రస్తావ విషయం-తల్లి
ఈశ్వరుడు చర్మ చక్షువులకు గోచరించడు. లోకంలో సామాన్య మానవులకు భగవంతుని ఉనికి అనుభవానికి రాదు. ఆ దయామయుడు పితరుల రూపంతో భూమి మీద ఉంటాడని విజ్ఞులంటారు. అందునా విశేషంగా తల్లి రూపంతో ఆయన ఉంటాడు. ఎవరు పుట్టినది మొదలు మనలను పాలన పోషణాదులు చేసి పెంచి పెద్ద చేస్తుందో ఆ తల్లి మనకు పరమ పూజనీయురాలు. ఆమె ముందు మనమెప్పుడూ చిన్నవాళ్ళమే.
తల్లి సర్వ సంగ పరిత్యాగిని సన్యాసిని అయినా కూడా పూజనీయురాలే. ఆమె స్వార్థం వదలి తన బాగు లెక్కచెయ్య కుండా ఎప్పుడూ సంతానాన్ని పోషించటం కోసం,వాళ్ళ ప్రయోజనం కోసం మాత్రమే తన జీవితం గడుపుతుంది.
ప్రసవ సమయంలో, ఆ తరువాత కూడా విపరీతమైన శరీర బాధను ఆమె భరిస్తుంది. పాలిచ్చి పెంచుతుంది. అన్ని అశుభాల నుండి కాపాడుతుంది. సంతానం ఆనందిస్తే ఆనందిస్తుంది, దుఃఖిస్తే వ్యథ చెందుతుంది. ప్రేమతో లాలిస్తూ లోక వ్యవహారాలను, మంచీ చెడూ నేర్పుతుంది. తప్పు చేస్తే ముందు మంచిగా చెప్తుంది. అప్పుడు వినకపోతే కోపంతో దండిస్తుంది.
ఒకవేళ ఎవరైనా తన సంతానానికి కీడుచేస్తే అప్పుడు ఆమె అంతులేని కోపంతో శపిస్తుంది.కేవలం మానవులలోనే కాదు జీవ కోట్లలో సర్వ ప్రాణులలో తల్లులలో ఈ లక్షణమే కనుపిస్తుంది.
వార్ధక్యంలో ఆమె యొక్క సేవయే కొడుకు పరమ కర్తవ్యం. ఆమె పాదాలను ఒత్తుటంలోనే మనస్సు తీర్థ స్నానం చేసినదానితో సమానమైన శాంతి ప్రసన్నతలను పొందుతుంది. ఆ సేవ కన్నా పుణ్యకార్యం లోకంలో వేరే లేదు.
--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
No comments:
Post a Comment