Sunday, September 5, 2021

ప్రస్తావ పారిజాతం-20 విషయం -- చంద్రుడు

🎀 *ప్రస్తావ-పారిజాతః-20* 🎁
*ప్రస్తావ పారిజాతం-20 (సంస్కృతలేఖ - తెలుగు అనువాదం)*
--------------------------
🌷

సంస్కృతరచన- సంకా ఉషారాణి
తెలుగు అనువాదం- పులిపాక వేంకట లక్ష్మీకాంత రావు
🌸

🌻 ప్రస్తావవిషయః -- చన్ద్రః 🌺

చన్దయతి ఆహ్లాదయతి చన్దతి దీప్యతే ఇతి వా చన్ద్రః। నవగ్రహేష్వన్యతమోఽయం గ్రహః శీతత్వప్రసాదనాహ్లాదజననాదిగుణైః లోకే సుప్రఖ్యాతః। రాత్రౌ రాజా భూత్వా సూర్యాభావే కాన్తిం ప్రసారయతి। ఏషః నక్షత్రాణాం పతిరితి, సున్దరః, నిత్యధవలవస్త్రధారీతి వర్ణితః। శశచిహ్నభృదయం శృఙ్గారరసే ముఖ్యతమః ఉద్దీపనవిభావః విరాజతే। నానాభాషాసు, వివిధప్రదేశేషు చ, ప్రాచీనకాలికైః ఆధునికైశ్చ రచయితృభిః ఏషః వివిధసంయోగవిప్రయోగాదిసన్దర్భేషు నైకేషు స్థలేషు ఉపమానరూపేణ వర్ణితః। సాహిత్యవాఙ్మయే, శాస్త్రీయే చ, నానావిధనృత్యగీతాదిషు కలాసు, జ్యోతిఃశాస్త్రేఽపి స్వర్లోకదేవానామన్యతమస్యాస్య మహాన్ ఉల్లేఖో వర్తతే। చన్ద్రకాన్తిః పూర్ణిమాయామతిశయేన ప్రతిభాతి, అమావాస్యాం చ నితరాం క్షీణా భవతి। పార్వతీపతేః జటాజూటే అలఙ్కృతస్యాస్య షోడశకలాః సన్తి। ప్రతిపదా-ద్వితీయేత్యారభ్య పౌర్ణమీపర్యన్తమేకః పఞ్చదశదివసీయః పక్షః, పునః తస్మిన్నేవ క్రమే అమావాస్యాన్తః అపరః పక్షః చ భవతః। పురాణేషు మనఃకారకమిమమధికృత్య నైకాః కథాః ఉపవర్ణితాః సన్తి। ఉత్పలానామానన్దకారకమిమం దర్శయిత్వా మాతరః శిశూన్ అన్నం ఖాదయన్తి స్మ। యన్త్రాదిభిః పరివృతాః సామ్ప్రతికాః చన్ద్రదర్శనసౌఖ్యం, ఆహ్లాదభావం చ విస్మృతవన్తః దృశ్యన్తే॥

--సంకా ఉషారాణి
-----------------------------------------------
ప్రస్తావవిషయం- చంద్రుడు

సంతోషపెట్టును లేక ఆహ్లాదము కలిగించును, వెలుగునిచ్చును కనుక చంద్రుడు. నవగ్రహాలలో ఒకటి ఈ గ్రహం. చల్లదనము, ప్రసన్నత, ఆహ్లాదము కలిగించే గుణముల చేత లోకంలో బహు ప్రఖ్యాతుడు. రాత్రిలందు రాజుగా సూర్యుడి పరోక్షంలో వెలుగును ప్రసరింప జేస్తాడు. ఈతడు నక్షత్రాలకు పతి అని,సుందరుడు, నిత్యము తెల్లని వస్త్రాలను ధరిస్తాడని వర్ణింపబడినాడు. కుందేలు చిహ్నాన్ని ధరించే ఈతడు శృంగార రసమందు ముఖ్యమైన ఉద్దీపన విభావంగా వెలుగుతాడు. అనేక భాషలలో, వివిధ ప్రదేశాలలోనూ ప్రాచీనకాలికులైన రచయితల చేతనూ ,ఆధునిక రచయితలచేతనూ ఈతడు వివిధ సంయోగ వియోగ సందర్భాలలో, ఎన్నో చోట్ల ఉపమానంగా వర్ణించబడినాడు. సాహిత్య వాజ్ఞ్మయములో,శాస్త్రములందున్నూ, నానావిధ నృత్యగీతాది కళలలో , జ్యోతిశ్శాస్త్రంలో కూడా, స్వర్గలోక దేవతలలో ఒకడైన ఈతని గురించి గొప్పగా వ్రాయబడింది.
చంద్రకాంతి పౌర్ణమినాడు చాలా గొప్పగా ఉంటుంది. అమావాస్య నాడు పూర్తిగా క్షీణించి ఉంటుంది. పార్వతీపతి జటాజూటంలో అలంకరింపబడే ఇతనికి పదహారు కళలు ఉంటవి.
పాడ్యమీ,విదియ నుండి ఆరంభమై పౌర్ణమి వరకు పదిహేను దినముల పక్షము, మళ్ళీ అదే క్రమంలో అమావాస్యతో అంతమయ్యే రెండవ పక్షమున్నూ ఉంటుంది. పురాణములలో మనసుకు కారకుడైన ఈతని గురించి అనేక కథలు వర్ణించబడి ఉన్నవి. కలువలకు ఆనందకారకుడైన ఈతనిని చూపిస్తూ తల్లులు పిల్లలకు అన్నం తినిపిస్తారు. యాంత్రిక జీవితంలో ఉన్న నేటివారు చంద్ర దర్శన సుఖమును, ఆహ్లాదభావమునూ మరచి పోయినట్లు అనిపిస్తున్నది.

--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు


No comments:

Post a Comment

ప్రస్తావ పారిజాతం-20 విషయం -- చంద్రుడు

🎀 *ప్రస్తావ-పారిజాతః-20* 🎁 *ప్రస్తావ పారిజాతం-20 (సంస్కృతలేఖ - తెలుగు అనువాదం)* -------------------------- 🌷 సంస్కృతరచన- సంకా ఉషారాణి తెల...