Sunday, September 5, 2021

ప్రస్తావ పారిజాతం-20 విషయం -- చంద్రుడు

🎀 *ప్రస్తావ-పారిజాతః-20* 🎁
*ప్రస్తావ పారిజాతం-20 (సంస్కృతలేఖ - తెలుగు అనువాదం)*
--------------------------
🌷

సంస్కృతరచన- సంకా ఉషారాణి
తెలుగు అనువాదం- పులిపాక వేంకట లక్ష్మీకాంత రావు
🌸

🌻 ప్రస్తావవిషయః -- చన్ద్రః 🌺

చన్దయతి ఆహ్లాదయతి చన్దతి దీప్యతే ఇతి వా చన్ద్రః। నవగ్రహేష్వన్యతమోఽయం గ్రహః శీతత్వప్రసాదనాహ్లాదజననాదిగుణైః లోకే సుప్రఖ్యాతః। రాత్రౌ రాజా భూత్వా సూర్యాభావే కాన్తిం ప్రసారయతి। ఏషః నక్షత్రాణాం పతిరితి, సున్దరః, నిత్యధవలవస్త్రధారీతి వర్ణితః। శశచిహ్నభృదయం శృఙ్గారరసే ముఖ్యతమః ఉద్దీపనవిభావః విరాజతే। నానాభాషాసు, వివిధప్రదేశేషు చ, ప్రాచీనకాలికైః ఆధునికైశ్చ రచయితృభిః ఏషః వివిధసంయోగవిప్రయోగాదిసన్దర్భేషు నైకేషు స్థలేషు ఉపమానరూపేణ వర్ణితః। సాహిత్యవాఙ్మయే, శాస్త్రీయే చ, నానావిధనృత్యగీతాదిషు కలాసు, జ్యోతిఃశాస్త్రేఽపి స్వర్లోకదేవానామన్యతమస్యాస్య మహాన్ ఉల్లేఖో వర్తతే। చన్ద్రకాన్తిః పూర్ణిమాయామతిశయేన ప్రతిభాతి, అమావాస్యాం చ నితరాం క్షీణా భవతి। పార్వతీపతేః జటాజూటే అలఙ్కృతస్యాస్య షోడశకలాః సన్తి। ప్రతిపదా-ద్వితీయేత్యారభ్య పౌర్ణమీపర్యన్తమేకః పఞ్చదశదివసీయః పక్షః, పునః తస్మిన్నేవ క్రమే అమావాస్యాన్తః అపరః పక్షః చ భవతః। పురాణేషు మనఃకారకమిమమధికృత్య నైకాః కథాః ఉపవర్ణితాః సన్తి। ఉత్పలానామానన్దకారకమిమం దర్శయిత్వా మాతరః శిశూన్ అన్నం ఖాదయన్తి స్మ। యన్త్రాదిభిః పరివృతాః సామ్ప్రతికాః చన్ద్రదర్శనసౌఖ్యం, ఆహ్లాదభావం చ విస్మృతవన్తః దృశ్యన్తే॥

--సంకా ఉషారాణి
-----------------------------------------------
ప్రస్తావవిషయం- చంద్రుడు

సంతోషపెట్టును లేక ఆహ్లాదము కలిగించును, వెలుగునిచ్చును కనుక చంద్రుడు. నవగ్రహాలలో ఒకటి ఈ గ్రహం. చల్లదనము, ప్రసన్నత, ఆహ్లాదము కలిగించే గుణముల చేత లోకంలో బహు ప్రఖ్యాతుడు. రాత్రిలందు రాజుగా సూర్యుడి పరోక్షంలో వెలుగును ప్రసరింప జేస్తాడు. ఈతడు నక్షత్రాలకు పతి అని,సుందరుడు, నిత్యము తెల్లని వస్త్రాలను ధరిస్తాడని వర్ణింపబడినాడు. కుందేలు చిహ్నాన్ని ధరించే ఈతడు శృంగార రసమందు ముఖ్యమైన ఉద్దీపన విభావంగా వెలుగుతాడు. అనేక భాషలలో, వివిధ ప్రదేశాలలోనూ ప్రాచీనకాలికులైన రచయితల చేతనూ ,ఆధునిక రచయితలచేతనూ ఈతడు వివిధ సంయోగ వియోగ సందర్భాలలో, ఎన్నో చోట్ల ఉపమానంగా వర్ణించబడినాడు. సాహిత్య వాజ్ఞ్మయములో,శాస్త్రములందున్నూ, నానావిధ నృత్యగీతాది కళలలో , జ్యోతిశ్శాస్త్రంలో కూడా, స్వర్గలోక దేవతలలో ఒకడైన ఈతని గురించి గొప్పగా వ్రాయబడింది.
చంద్రకాంతి పౌర్ణమినాడు చాలా గొప్పగా ఉంటుంది. అమావాస్య నాడు పూర్తిగా క్షీణించి ఉంటుంది. పార్వతీపతి జటాజూటంలో అలంకరింపబడే ఇతనికి పదహారు కళలు ఉంటవి.
పాడ్యమీ,విదియ నుండి ఆరంభమై పౌర్ణమి వరకు పదిహేను దినముల పక్షము, మళ్ళీ అదే క్రమంలో అమావాస్యతో అంతమయ్యే రెండవ పక్షమున్నూ ఉంటుంది. పురాణములలో మనసుకు కారకుడైన ఈతని గురించి అనేక కథలు వర్ణించబడి ఉన్నవి. కలువలకు ఆనందకారకుడైన ఈతనిని చూపిస్తూ తల్లులు పిల్లలకు అన్నం తినిపిస్తారు. యాంత్రిక జీవితంలో ఉన్న నేటివారు చంద్ర దర్శన సుఖమును, ఆహ్లాదభావమునూ మరచి పోయినట్లు అనిపిస్తున్నది.

--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు


ప్రస్తావ పారిజాతం-19 విషయం -- భాష

🎀 ప్రస్తావ-పారిజాతః-19 🎁
ప్రస్తావ పారిజాతం-19 (సంస్కృతలేఖ - తెలుగు అనువాదం)
--------------------------
🌷
రచన-
సంస్కృతం -సంకా ఉషారాణి
తెలుగు- పులిపాక వేంకట లక్ష్మీకాంత రావు
🌸
🌻ప్రస్తావవిషయః -- భాషా 🌺

    భాష్యతే శాస్త్రవ్యవహారాదినా ప్రయుజ్యతే ఇతి భాషా। భాషా ఏవ మానవస్య పశోః చ మధ్యే భేదకః విషయః వర్తతే। పురుషాణాం పరస్పరం సఁల్లాపాయ, హృద్గతభావానాం జ్ఞాపనాయ, సమ్భాషణాయ, జ్ఞానాదాన-ప్రదానాయ చ భాషోపయుజ్యతే। భాషా లిఖితరూపా, వచనరూపా చేతి ద్వివిధా। లిఖితరూపా పఠ్యతే, ఉక్తరూపా చ శ్రూయతే। ఉక్తరూపాయాః శ్రవణేన వచనశక్తిర్వర్ధతే, లిఖితరూపాయాః పఠనేన లేఖనశక్తిశ్చ। భాషావ్యవహారేణైవ మనుష్యాణాం అన్తఃప్రకృతిః జ్ఞాయతే। భాషయా కస్యచిత్ పురుషస్య ప్రదేశః, సామాజికస్తరః, విద్యావత్త్వం, జాతిరిత్యాదయః జ్ఞాయన్తే। రూపపరివర్తనేన మానవః అన్యాన్ వఞ్చితుం శక్నోతి। పరన్తు భాషయా న కదాపి తథా కర్తుం పారయతి। బాలః జ్యేష్ఠాన్ దృష్ట్వా, వ్యవహారం పశ్యన్ భాషాం క్రమేణ గృహ్ణాతి। లోకేఽస్మిన్ వివిధాః భాషాః సన్తి। సంస్కృతం, ప్రాకృతమిత్యాదిభాషాః ప్రాచీనాః। తేలుగు-మరాఠీ-తమిలాదిభాషేత్యాదయః ఆధునికాః॥

--సంకా ఉషారాణి
-----------------------------------------------

ప్రస్తావవిషయం-భాష

మాట్లాడేది,శాస్త్ర వ్యవహారాలు మొదలైన వాటిలో ప్రయోగింపబడేది భాష. భాషయే మనుష్యులు పశువుల మధ్య వ్యత్యాసాన్ని తెలిపేది.పురుషుల మధ్య పరస్పర సల్లాపాలు, మనసులో భావాలు పంచుకోవడానికి, సంభాషించడానికి, జ్ఞానాన్ని పంచుకోవడానికి కూడా భాషను ఉపయోగించబడుతుంది.
భాష వ్రాత రూపంలోనూ,మాటగానూ రెండు విధాలు. వ్రాత రూపంలో చదువ బడుతుంది. మాట వినబడుతుంది. మాటలను వినటం వలన వినికిడి శక్తి పెరుగుతుంది. వ్రాత రూపంలో చదవటం వలన వ్రాసే శక్తి పెరుగుతుంది. భాషా వ్యవహారం వలననే మనుషుల స్వభావం తెలుస్తుంది. భాష వలన ఒకానొక పురుషుడి దేశం, సామాజిక స్థాయి, విద్వత్తు, జాతి మొదలైనవి తెలుస్తాయి. రూపం మార్చుకుని మనిషి ఇతరులను మోసగించగలడు. కానీ భాషతో ఎప్పుడూ అలా చేయటం కుదరదు. పిల్లలు పెద్దవాళ్ళను, వాళ్ళ ప్రవర్తనను చూసి భాషను క్రమంగా గ్రహిస్తారు. లోకంలో అనేక భాషలున్నాయి. సంస్కృతము, ప్రాకృతము ఇత్యాది భాషలు ప్రాచీనమైనవి.తెలుగు-
మరాఠీ-తమిళం మొదలైన భాషలు ఆధునికాలు.

--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు

ప్రస్తావ పారిజాతం-18 విషయం -- గురువు

🎀 *ప్రస్తావ-పారిజాతః-18* 🎁
*ప్రస్తావ పారిజాతం-18 (సంస్కృతలేఖ - తెలుగు అనువాదం)*
--------------------------
🌷

సంస్కృతరచన- సంకా ఉషారాణి
తెలుగు అనువాదం- పులిపాక వేంకట లక్ష్మీకాంత రావు
🌸

🌻 ప్రస్తావవిషయః -- గురుః 🌺

గృణాతి ఉపదిశతి వేదాదిశాస్త్రాణి ఇన్ద్రాది-దేవేభ్యః ఇతి, యద్వా గీర్యతే స్తూయతే దేవ-గన్ధర్వమనుష్యాదిభిః ఇతి గురుః। సత్సు గురుశబ్దేనాభిహితేషు బహుష్వపి ప్రాయః సామాన్యతయా గురుశబ్దేన జ్ఞానప్రదాతా ఆచార్య ఏవ మనసి స్ఫురతి। దేవేభ్యోఽప్యతిరిచ్య యః తిష్ఠతి, భువౌ సన్మార్గదర్శనేన నరముత్తమలోకాన్ ప్రాపయతి యః, సః గురుః బ్రహ్మావిష్ణుమహేశ్వరతుల్య ఇతి గురుగీతాయాముచ్యతే। గురుపరమ్పరాయాం స్థిత్వా సచ్చిదానన్దచిన్తనే నిరన్తరం మగ్నం గురుం సముపగమ్య జ్ఞానగ్రహణేన యః జనః స్వజన్మ సార్థకం కరోతి, సః పునః సంసారసాగరే న పతతి। గురుసేవయా మహాపుణ్యం ప్రాప్యతే। సనాతనధర్మగ్రన్థాః సర్వే గురోః మహిమానం వర్ణయన్తి। సద్గురుసన్నిధిః కోటిజన్మనాం పుణ్యేనైవ లభ్యతే। భగవాన్ బాదరాయణః, శఙ్కరాచార్యః ఇత్యాదయః బహవః ఆచార్యః సద్గురవః సన్తః సముల్లసన్తి భారతభూమౌ। న గురోరధికం తత్త్వం, న గురోరధికం తపః- ఇతి ఉక్తిః సత్యమేవ భాతి। యేషాం గురుః నాస్తి, తే భగవన్తమేవ గురురితి మత్వా పూజయన్తి। స్వప్నేపి కదాపి వినోదాయాపి గురునిన్దా న కర్తవ్యా। యత్ర గురోః నిన్దనం భవతి తతః ఝటితి బహిః గన్తవ్యమ్। కదాపి గురోః అవమాననం న కర్తవ్యమ్। గురౌ కుప్యతి దేవోఽపి న రక్షతి। వన్దే గురుపరమ్పరామ్॥

-సంకా ఉషారాణి
-----------------------------------------------
ప్రస్తావవిషయం -- గురువు
ఇంద్రాది దేవతలకు ఉపదేశం చేయువాడు, వేదాది శాస్త్రాలను ఉపదేశించేవాడు లేక దేవ గంధర్వమనుష్యాదుల చేత కీర్తింపబడేవాడు, స్తుతింపబడేవాడు గురువు. గురువు అనే మాట చేత పిలువబడే వాళ్ళు చాలామంది ఉన్నా సామాన్యంగా గురువు అనే శబ్దం చేత జ్ఞానప్రదాత అయిన ఆచార్యుడే మనసులో స్ఫురిస్తాడు.
దేవతలకన్నా పైన ఎవరు ఉంటారో, భూమిపైన మంచి మార్గాన్ని చూపించటం వల్ల
మనుష్యులకు ఉత్తమ లోకాలను కలిగిస్తాడో, ఆ గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమానమైనవాడు అని గురుగీతలో చెప్పబడింది.
గురు పరంపరలో ఉంటూ సచ్చిదానంద చింతనలో నిరంతరం మునిగి ఉండే గురువును సమీపించి జ్ఞాన సముపార్జనతో ఎవరు తమ జన్మను సార్థకం చేసుకుంటారో ,వారు మళ్ళీ సంసార సాగరంలో పడరు.
గురు శుశ్రూష వలన మహా పుణ్యం కలుగుతుంది. సనాతన ధర్మ గ్రంథాలన్నీ గురువు యొక్క మహిమను వర్ణిస్తాయి. సద్గురువు సన్నిధి కోటి జన్మల పుణ్య వలననే లభిస్తుంది. భగవంతుడైన బాదరాయణుడు(వేదవ్యాసుడు) శంకరాచార్యులవారు మొదలైన చాలామంది ఆచార్యులు, సద్గురువులు, సన్తులు భారతభూమియందు పుట్టారు.
గురువును మించిన తత్త్వం లేదు, గురువును మించిన తపస్సు లేదు, అనే మాట సత్యమనిపిస్తుంది. ఎవరికి గురువు లేడో వారు భగవంతుడినే గురువని తలచి పూజిస్తారు. కలలోకూడా ఎప్పుడూ వినోదానికి కూడా గురునింద చేయకూడదు. ఎక్కడ గురునింద జరుగుతూ ఉంటుందో, అక్కడ నుండి వెంటనే బయటకు వెళ్లిపోవాలి. ఎప్పుడూ గురువును అవమానించకూడదు. గురువు కోపిస్తే దేవతలు కూడా రక్షింపలేరు.
గురు పరంపరకు వందనం.

--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు

ప్రస్తావ పారిజాతం-17 విషయం -- వివేకానందుడు

 🎀 *ప్రస్తావ-పారిజాతః-17* 🎁
*ప్రస్తావ పారిజాతం-17 (సంస్కృతలేఖ - తెలుగు అనువాదం)*
--------------------------
🌷

సంస్కృతరచన- సంకా ఉషారాణి
తెలుగు అనువాదం- పులిపాక వేంకట లక్ష్మీకాంత రావు
🌸

🌻ప్రస్తావవిషయః -- వివేకానన్దః; 🌺
సనాతనధర్మప్రచారకేషు, భారతీయతాయాః ప్రసారకేషు దేశవిదేశేషు విఖ్యాతం నామ వివేకానన్దస్య। అయం పురుషసింహః రామకృష్ణపరమహంసమ్ ఉపగమ్య, భగవద్దర్శనప్రాప్త్యా తుష్టః సన్ తస్య శిష్యత్వం స్వీకృతవాన్। బాల్యే నరేన్ద్రనామ్నా అభిహితోఽయం ఆగామినికాలే వివేకానన్ద ఇతి అఖిలవిశ్వస్మిన్ ప్రసిద్ధో జాతః। సాధుపుఙ్గవోఽయం వేదాన్తదర్శనస్య, యోగ-భక్తి-కర్మాదిమార్గాణాం చ సుష్టు వ్యాఖ్యానం కృతవాన్। అస్య ప్రవచనైః యువజనానాం హృదయాని అద్యాపి ఉల్లాసేన, ఉత్సాహేన చ పరిపుష్టాని భవన్తి। యే నిఃస్పృహయా, నిరీహతయా చ దుఃఖభాజనాని భూత్వా మనఃపీడామనుభవన్తి, తేఽపి అస్య వాణీం శ్రుత్వా పునః నూతనోత్తేజసా సమ్పన్నాః భూత్వా జీవనసమరాఙ్గణాయ సన్నద్ధాః భవన్తి। దేశసేవాయై, ధర్మసేవాయై చాయం మహాత్మా అవివాహితః అతిష్ఠత్। అన్నపానాదిరహితః, రోగాదినా పీడితోఽపి క్లేశాన్ సహమానః అనేకాన్ త్యాగాన్ కృతవాన్। అస్య శిష్యాః, అనుగామినశ్చ బహుషు దేశేషు సన్తి। అయమేవ రామకృష్ణామిశన్-ఇతి గురోః నామ్నా సంస్థామేకామారబ్ధవాన్। యుగపురుషస్యాస్య మహాత్మనః వివేకానన్దస్యోక్తీః, ప్రవచనాని చ అనేకపుస్తకేషు ప్రకాశితాః సన్తి। అస్య జీవనకథామధికృత్య కావ్యాన్యపి రచితాని॥

-సంకా ఉషారాణి
-----------------------------------------------
ప్రస్తావ విషయం- వివేకానందుడు

సనాతన ధర్మ ప్రచారకులలో దేశవిదేశాలలో విఖ్యాతమైన పేరు వివేకానందునిది. ఈ పురుషసింహుడు రామకృష్ణుని దగ్గరకు వెళ్లి భగవంతుని దర్శనం కలగటంతో సంతుష్టుడై ఆయన శిష్యరికాన్ని స్వీకరించాడు. బాల్యంలో నరేంద్రుడనే పేరుగలిగి తరువాత కాలంలో వివేకానందుడనే పేర అఖిల విశ్వంలో ప్రసిధ్ధుడైనాడు. సాధుపుంగవుడైన ఈయన వేదాంతదర్శనమును, యోగ-భక్తి-కర్మాది మార్గాలకు చక్కని వ్యాఖ్యానం చేశాడు. ఈయన ప్రవచనాలచేత యువత హృదయాలు ఈనాటికీ ఉల్లాసంతో ఉత్సాహంతో పరిపుష్టమౌతవి.ఎవరు నిస్పృహతో, కోరికలు లేకుండానూ, దుఃఖభాజనులై మనసులో బాధపడుతూ ఉంటరో వారు సైతం ఈయన మాటలను విని మళ్ళీ క్రొత్త ఉత్సాహంతో కూడి జీవన యుద్ధరంగంలో సన్నద్ధంగా ఉంటారు. దేశసేవ,ధర్మ సేవ కొరకు ఈ మహాత్ముడు అవివాహితుడుగా ఉన్నాడు. అన్నపానాలు లేకుండా,రోగాదులతో పీడించబడి, బాధలను సహిస్తూ ఎన్నో త్యాగాలు చేశాడు. ఈయన శిష్యులు, అనుయాయులు అనేక దేశాలలో ఉన్నారు. ఈయనే రామకృష్ణ మిషన్ అని గురువు పేర సంస్థనొక దానిని ఆరంభించారు. యుగపురుషుడైన ఈ మహాత్ముడు వివేకానందని ఉక్తులు, ప్రవచనాలూ అనేక పుస్తకాలలో ప్రకటించబడిఉన్నవి. ఈయన జీవిత కథను గురించి కావ్యాలు కూడా రచింపబడినాయి.

--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు

ప్రస్తావ పారిజాతం-16 విషయం -- పుష్పాణి-పువ్వులు

 🎀 *ప్రస్తావ-పారిజాతః-16* 🎁
*ప్రస్తావ పారిజాతం-16 (సంస్కృతలేఖ - తెలుగు అనువాదం)*
--------------------------
🌷

సంస్కృతరచన- సంకా ఉషారాణి
తెలుగు అనువాదం- పులిపాక వేంకట లక్ష్మీకాంత రావు
🌸

🌻 ప్రస్తావవిషయః -- పుష్పాణి ⚜
    పుష్ప్యతి వికసతి యత్ తత్ పుష్పమ్। పుష్పమస్యాం సృష్టౌ సమస్తవస్తుషు సర్వసున్దరం, సుకోమలం చ వస్తుజాతమ్। అస్య రచనేన విధాతా సాక్షాద్ ఆనన్దస్య రూపకల్పనం కృతవానివ భాతి। పుష్పదర్శనేన సర్వే మానవాః ప్రాయః తుష్యన్తి। తాని నానావర్ణకాని, విభిన్నరూపాకృతికాని, వివిధప్రకారకసుగన్ధయుక్తాని చ భవన్తి। భ్రమరాణాం జీవభూతాని తరుప్రజాతాని మృదూనీమాని వస్తూని ప్రసూన-కుసుమ-సుమ-ఇత్యాదినామభిః అభిధీయన్తే। ఏషాం దర్శనేన, స్పర్శనేన వా మానసోల్లాసో జాయతే। దేవానాం షోడశోపచారపూజనే, నిత్యపూజాయామ్, అతిథిసేవాయాం, మహాపురుషాణాం సాధుసజ్జనానాం చార్చన-పూజనాదిషు పుష్పాణాం ముఖ్యం కార్యం వర్తతే। అలఙ్కరణాయ, ప్రకోష్ఠేషు, వివాహాదిషు పుష్పాణి ఉపయుజ్యన్తే। పుష్పప్రదానేన బాలాః, యువతయః, మాతరః సర్వాః చ తుష్యన్తి। స్వాగత-సత్కారాది-కార్యక్రమేషు, సభాసు గోష్ఠీషు చ పురుషస్య గౌరవసమ్పాదనాయ పుష్పగుచ్ఛాః అనుదీయన్తే। కవిభిః వర్ణనపరైః చ సౌన్దర్యవర్ణనం ప్రాయః పుష్పానాముపమానేనైవ క్రియతే। పుష్పైః వినా సృష్టిరియం వర్ణవిహీనా అభవిష్యత్।
అహింసా ప్రథమం పుష్పం పుష్పమిన్ద్రియనిగ్రహః।
సర్వపుష్పం దయా భూతే పుష్పం శాన్తిర్విశిష్యతే।
శమః పుష్పం తపః పుష్పం ధ్యానం పుష్పం చ సప్తమమ్।
సత్యం చైవాష్టమం పుష్పమేతైస్తుష్యతి కేశవః॥

-సంకా ఉషారాణి
-----------------------------------------------
 ప్రస్తావ విషయం-- పుష్పములు

పుష్పించి వికసించేది ఏదో అది పుష్పము.పుష్పము ఈ సృష్టిలో అన్ని వస్తువులలోనూ సర్వ సుందరము,అతి కోమలమూ అయిన వస్తువు. దీని యొక్క సృష్టి చేయటం వల్ల విధాత సాక్షాత్తు ఆనందము యొక్క రూపకల్పన చేసినట్లు అనిపిస్తుంది. పుష్ప దర్శనం వలన మానవులందరూ సంతోషిస్తారు. అవి నానా వర్ణాలతో, విభిన్న రూపాలలో,ఆకారాలతో, రకరకాల సవాసనలతో ఉంటాయి. తుమ్మెలకు జీవాధారములైనవి తరువులకు పూచేవి మృదువైనవి అయిన ఈ వస్తువులు ప్రసూనములు, కుసుమములు,సుమములు మొదలైన పేర్లతో పిలువబడతాయి. వీటిని చూడటం వలన,తాకటం వలన మనస్సుకు ఉల్లాసం కలుగుతుంది. దేవతల షోడశోపచార పూజలలో, నిత్య ఫపూజలలో,అతిథి సేవలయందు, మహాపురుషులు, సాధు సజ్జనులు యొక్క అర్చన పూజనాదులలో ముఖ్యమైనవిగా ఉంటాయి.
గదులలో అలంకరణకు, వివాహాలలో పూలను ఉపయోగిస్తారు. పుష్పాలను ఇవ్వటం వలన బాలురు, యువతులు, తల్లులు అందరూ సంతోషిస్తారు. స్వాగత సత్కారాలు మొదలైన కార్యక్రమాలలో, సభలూ గోష్ఠులలో పురుషుల గౌరవించటం కోసం పుష్పగుచ్ఛాలను ఇస్తారు.వర్ణించేవారైన
కవుల చేత కూడా సౌందర్య వర్ణన పుష్పములను ఉపమానముగానే చేయబడుతుంది. పువ్వులు లేకుండా ఈ సృష్టి వర్ణవిహీనం అయిఉండేది.
అహింసా ప్రథమ పుష్పం
పుష్పమిన్ద్రియ నిగ్రహః సర్వ పుష్పం దయా భూతే
పుష్పం శాంన్తిర్విషిష్యతే!
శమం పుష్పం తపః పుష్పం ధ్యానం పుష్పంచ సప్తమమ్!
సత్యంచైవాష్టమం పుష్పమేతైస్తుష్రతి కేశవః!!

 మానవులు దైవానికి అర్పించవలసిన ప్రత్యేక మైన పుష్పాలను శాస్త్రం ఈ విధంగా చెప్పింది.
మొదటి పుష్పం అహింస
ఇంకొక పుష్పం ఇన్ధ్రియ నిగ్రహం . దయ, శాంతి,శమము, తపస్సు ఇంకా ఏడవ పుష్పము ధ్యానం. సత్యము ఎనిమిదవ పుష్పము, వీటి వలన కేశవుడు సంతోషిస్తాడు.

--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు


ప్రస్తావ పారిజాతం- 15 విషయం -- పాఠశాల

 🎀 ప్రస్తావ-పారిజాతః- 15 🎁
ప్రస్తావ పారిజాతం- 15 (సంస్కృతలేఖ - తెలుగు అనువాదం)
--------------------------
🌷

సంస్కృతరచన- సంకా ఉషారాణి
తెలుగు అనువాదం- పులిపాక వేంకట లక్ష్మీకాంత రావు
🌸

🌻 ప్రస్తావవిషయః -- పాఠశాలా; 🌺
    పాఠశాలా నామ యత్ర విద్యాం శిక్షాం చ ప్రాప్నుమః తత్ స్థానమ్। యః కశ్చన సౌధః, యత్కిఞ్చిత్ నిర్మాణం వా పాఠశాలా న భవితుమర్హతి। యత్ర విద్యార్థినః కృతే భావిజీవనాయోపయోగి సర్వమావశ్యకం వస్తువిజ్ఞానం ప్రదీయతే, యత్ర శిక్షకాః విజ్ఞానే రతాః బోధనే ఆసక్తాః విద్యన్తే, పఠనపాఠనాదిభ్యః ఉపయుక్తః వస్తుసామగ్రీ వర్తతే, సుష్ఠు అనుశాసనం, సాధురూపేణ సర్వా చ వ్యవస్థా భవతి సైవ పాఠశాలేతి కథితుం శక్యతే। విద్యార్థినః పఠనమ్, అధ్యాపకాః పాఠనమ్, అన్యే ప్రాశాసానిక-కర్మచారిణః నిర్వహణం, సేవకాః మార్జనాదికర్మ- ఇత్యేవం రీత్యా సర్వే జనాః పాఠశాలాయాం స్వస్వకర్మాణి ఆచరన్తి। పాఠశాలా ప్రతిదినం ప్రాతఃకాలే సునిశ్చితసమయే ఘణ్టానాదేన ఆరభ్యతే। తతః సభాప్రాఙ్గణే ప్రార్థనా, సమాచారపఠనం చ భవతి। అథ సర్వే బాలబాలికాః స్వస్వకక్ష్యాః ప్రవిశన్తి। తత్ర నిర్దిష్టస్థలేషు ఉపవిశ్య ప్రత్యేకం విషయమనుసృత్య ప్రాయః ఏకహోరామితకాలం వా పాదోనఘణ్టామితకాలం వా అధ్యాపకైః పాఠితాన్ పాఠాన్ పఠన్తి। అధ్యాపకాః నీతిబోధనం, సమాజశిక్షాం, గణితం, భాషాశిక్షణం, విజ్ఞానం చ బోధయన్తి। మధ్యే అర్ధఘణ్టామితకాలః భోజనవిరామః భవతి। కదాచిత్ అధ్యాపకస్యానుపస్థితౌ బాలాః క్రీడాఙ్గణే ఖేలన్తి। క్వచిచ్చ గీతనృత్యాదిశిక్షణమపి దీయతే। ప్రతివర్షం వార్షికోత్సవమపి పాఠశాలాయాం నిర్వహన్తి। కదాచిత్ విద్యార్థినః కుత్రచిత్ పర్యటనాయాపి నయన్తి। ఏవం బాల్యకాలే పాఠశాలాయాః ప్రాముఖ్యం మహద్భవతి॥

-సంకా ఉషారాణి
-----------------------------------------------
ప్రస్తావ విషయం--పాఠశాల

పాఠశాల అంటే ఎక్కడ విద్య,శిక్షణ పొందుతామో ఆ స్థానం. ఏదో ఒక భవనము ఏదో ఒక కట్టడము కానీ పాఠశాల కావడానికి అర్హతకలిగినది కాదు. ఎక్కడ విద్యార్థుల కోసం భావిజీవితానికి ఉపయోగించే అవసరమైన సకల వస్తు విజ్ఞానం ప్రసాదించబడుతుందో, ఎక్కడ శిక్షకులు విజ్ఞాన మంటే ఇష్టంతో బోధించడానికి ఆసక్తి కలిగి ఉంటారో, చదవడానికి చదివించడానికి ఉపయోగపడే వస్తు సామగ్రి ఉంటుందో, చక్కని క్రమశిక్షణ,చక్కగా సకల వ్యవస్థ ఉంటుందో అదే పాఠశాల అనబడుతుంది.
విద్యార్థులు చదవటమూ ఉపాధ్యాయులు చదివించటమూ, ఇతరులు అనుశాసకులూ, పనివారి నిర్వహణ, సేవకులు తుడుచుట మొదలైన పనులు, ఇటువంటి రీతులలో సకల జనులూ పాఠశాలలో వారి వారి పనులను చేస్తూంటారు.
పాఠశాల ప్రతిరోజూ ఉదయం నియమిత సమయాన గంట మ్రోగటంతో ప్రారంభమౌతుంది. తరువాత సభా ప్రాంగణంలో ప్రార్థన, సమాచార పఠనమూ ఉంటుంది. అటు తరువాత బాలబాలికలందరూ వారి వారి తరగతి గదులలో ప్రవేశిస్తారు. అక్కడ నిర్దిష్ట స్థలాలలో కూర్చుని ఒక్కొక్క విషయాన్ని దాదాపు ఒక గంట సమయం వరకు లేదా ముప్పావు గంట వరకు అధ్యాపకుల చేత చదివించబడే పాఠాలను చదువుతారు. అధ్యాపకులు నీతిబోధ, సమాజ శిక్ష, గణితము, భాషా బోధన, విజ్ఞానాన్ని( విజ్ఞానవిషయాలను) కూడా బోధిస్తారు. మధ్యలో ఒక అరగంట సమయం భోజనం విరామం ఉంటుంది.ఎప్పుడైనా అధ్యాపకుల పర్యవేక్షణలో బాలురు ఆటస్థలంలో ఆడుకుంటారు. కొన్ని చోట్ల సంగీత నృత్యాదులలో కూడా శిక్షణ ఇవ్వబడుతుంది.ప్రతి సంవత్సరం పాఠశాలలో వార్షికోత్సవం కూడా జరుపుతారు. ఎప్పుడైనా విద్యార్థులను ఎక్కడికైనా పర్యయటనానిని తీసుకొని పోతారు.ఇలా బాల్యంలో పాఠశాల ప్రాముఖ్యం గొప్పగా ఉంటుంది.

--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు

ప్రస్తావ పారిజాతం- 14 విషయం -- జనకః-తండ్రి

🎀 *ప్రస్తావ-పారిజాతః- 14* 🎁
*ప్రస్తావ పారిజాతం- 14 (సంస్కృతలేఖ - తెలుగు అనువాదం)*
--------------------------
🌷

సంస్కృతరచన- సంకా ఉషారాణి
తెలుగు అనువాదం- పులిపాక వేంకట లక్ష్మీకాంత రావు
🌸
🌻 ప్రస్తావవిషయః -- జనకః 💥
జనయతీతి జనకః। పితా జన్మప్రభృతి సన్తానస్య సంరక్షకః, పరిపోషకశ్చ భవతి। సః పుత్రాదీనాం శరీరపోషణాయ, ఆవాసాదికల్పనాయ ధనమర్జతి। బాలకస్య గురుతుల్యః సః। బాల్యే గురుకులగమనాత్ పూర్వం విద్యాం బోధయతి। తస్య మనసి పుత్రాయ సహజం ప్రేమ ఉపజాయతే। స్వక్లేశమవిగణయ్య సః నానావిధపీడాభ్యః బాలం రక్షతి। పితుః సంరక్షణే స్థితః బాలః ఆత్మానం సమస్తజగతి సమ్పద్వాన్, బలవాన్, శక్తిశాలీ చ మన్యతే। మాతా పితా చ జగతీతలే భగవత్సమానౌ। పితృతుల్యాః జనాః అన్యే చత్వారః జనాః సన్తీతి శ్లోకేఽస్మిన్ ఉక్తమ్।
జనితా చోపనేతా చ యశ్చ విద్యాం ప్రయచ్ఛతి ।
అన్నదాతా భయత్రాతా పఞ్చైతే పితరః స్మృతాః ॥
కదాచిత్ కశ్చిత్ పితా పుత్రప్రేమ్ణి అన్ధ ఇవాచరతి। తేన న కేవలం లోకాయ అహితం, అపి తు బాలకస్య చరిత్రమపి వినశ్యతి। అన్ధం పుత్రవాత్సల్యమతిక్రమ్య పిత్రా పుత్రాయ ధర్మాధర్మవిజ్ఞానం బోధ్యమ్। కర్తవ్యాకర్తవ్యవివేచనఞ్చ ప్రబోద్ధవ్యమ్॥

-సంకా ఉషారాణి
-----------------------------------------------
ప్రస్తావ విషయం-- జనకుడు

జన్మనిచ్చువాడు జనకుడు. తండ్రి పుట్టిన నాటి నుండి సంతానము యొక్క సంరక్షకునిగా పోషకునిగానూ ఉంటాడు.
అతడు పుత్రాదుల శరీర పోషణకొరకు,నివాసము కొరకు ధనాన్ని సంపాదిస్తాడు. బాలకునికి గురుసమానుడతడు. బాల్యంలో గురుకులానికి వెళ్ళటానికి ముందు చదువు చెప్తాడు.అతని మనసులో సహజంగానే పుత్రుడిమీద ప్రేమ పుడుతుంది. తన బాధలను లెక్కచెయ్యకుండా అతడు నానా పీడలనుండి బాలుణ్ణి రక్షిస్తాడు.తండ్రి సంరక్షణలో ఉన్న బాలుడు తనను తాను సమస్త ప్రపంచంలో సంపదకలిగిన వానిగా,బలవంతునిగా,శక్తిశాలిగా తలుస్తాడు. తల్లిదండ్రులు ధరాతలంలో భగవత్సమానులు.
పితృతుల్యులైన వారు ఇతరులు నలుగురు ఉంటారని శ్లోకంలో చెప్పబడింది.

జనితా చోపనేతా చ యశ్చ విద్యాం ప్రయచ్ఛతి ।
అన్నదాతా భయత్రాతా పఞ్చైతే పితరః స్మృతాః।।
జన్మనిచ్చిన తండ్రి, ఉపనయనము చేసినవాడు, విద్యనేర్పిన వాడు, అన్నం పెట్టిన వాడూ, భయం నుండి రక్షించిన వాడూ ఈ అయిదుగురు తండ్రులని అంటారు.
ఒక్కొక్కసారి ఒకానొక తండ్రి పుత్రప్రేమతో గుడ్డివాడిలా ప్రవర్తిస్తాడు. అతని వలన లోకానికి హాని కలగటమే కాక, బాలుని జీవితం కూడా నాశనమవుతుంది. గుడ్డి ప్రేమలో పడకుండా తండ్రులచేత పుత్రులకొరకు ధర్మాధర్మ విజ్ఞానం బోధింపబడాలి. చేయదగినది, చేయదగనిది అనే వివేచన కూడా బోధింపబడాలి.

--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు

ప్రస్తావ పారిజాతం-13 విషయం -- నదీ

 🎀 *ప్రస్తావ-పారిజాతః-13* 🎁
*ప్రస్తావ పారిజాతం-13 (సంస్కృతలేఖ - తెలుగు అనువాదం)*
--------------------------
🌷

సంస్కృతరచన- సంకా ఉషారాణి
తెలుగు అనువాదం- పులిపాక వేంకట లక్ష్మీకాంత రావు
🌸
🌷ప్రస్తావవిషయః -- నదీ; 🌸
    నదతీతి నదీ। ఆపః పవిత్రం పరమం పృథివ్యామితి కిలార్యోక్తిః। నిత్యప్రవాహశీలా సా తోయవాహినీ సమస్తపరిసరప్రదేశాన్ పవిత్రీకరోతి। సా క్షేత్రేషు సస్యసంవర్ధనార్థం భూమిసిఞ్చనాయ ఉపయుక్తా సతీ సర్వజీవేభ్యః అన్నప్రదాత్రీ రారాజతే। వారిసమృద్ధ్యా దాహతాపాదిభ్యః ఉపశమనం దదతీ, సా దర్శనమాత్రేణ హృదయశాన్తిం, చిత్తశుద్ధిం చ ప్రదదాతి। కిం పునః తస్యాం మజ్జనస్య, స్నానాదీనాం చ మహత్త్వస్య పృథక్కథనేన? గఙ్గా-యమునా-నర్మదా-గోదావర్యాదినద్యః ఉత్తరదక్షిణ-పూర్వ-పశ్చిమభారతస్య భూమిం పునీతాం కుర్వన్త్యః ప్రవహన్తి। పురాణేషు బహుత్ర నదీనాం మహత్త్వం, స్నానఫలితం చ నైకవారముక్తమ్। నద్యః కలకలనాదేన శ్రోత్రానన్దం, స్వచ్ఛజలదర్శనేన నేత్రానన్దం, మధురజలపానే రసానన్దం, ఉపస్పర్శనేన స్పర్శానన్దం, సిఞ్చితాయాః ధరాయాః మృత్తికాయాః సుగన్ధేన ఘ్రాణానన్దం చానుదదతి। పౌర్ణమాస్యాది-పుణ్యదివసేషు జనాః నదీస్నానం కుర్వన్తి, శరీరస్య, మనసః చ తాపోపశమనం ప్రాప్య స్వజీవనం ధన్యం కుర్వన్తి॥
-----------------------------------------------
🌷ప్రస్తావవిషయః -- నదీ; 🌸
నదతీ అంటే శబ్దం చేస్తుంది కనుక నది. పృథ్విలో నీరు పరమ పవిత్రమైనదని కదా ఆర్యోక్తి. నిత్య ప్రవాహశీల అయిన ఆ జలప్రవాహం సకల పరిసర ప్రదేశాలను పవిత్రం చేస్తుంది. అది పొలాలలో పంటలు పండటానికి భూమిని తడపటానికి ఉపయోగపడుతూ సర్వజీవులకూ అన్నప్రదాత్రిగా ప్రకాశిస్తుంది. నీరు సమృద్ధిగా దప్పికను తీర్చటం మొదలైన ఉపశమనాలను ప్రసాదిస్తూ,దర్శనమాత్రం చేత హృదయ శాంతినీ, చిత్తశుద్ధినీ ప్రసాదిస్తుంది. ఇక దానిలో మునగటమూ, స్నానం చేయటమూ యొక్క మహాత్మ్యాన్ని ప్రత్యేకంగా చెప్పేదేముంది? గంగా యమునా,నర్మదా, గోదావరీ మొదలైన నదులు ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ భారతభూమిని పునీతం చేస్తూ ప్రవహిస్తాయి. పురాణాలలో చాలా చోట్ల నదుల మాహాత్మ్యము,స్నాన ఫలితమునూ చాలా సార్లు చెప్పబడింది. నదులు గలగల శబ్దాలతో చెవులకానందమూ, స్వచ్ఛ జలదర్శనం వలన నేత్రానందమూ, మధుర జలపానం వల్ల రసానందమూ,తాకటం వలన స్పర్శానందమూ, నేలమీద మట్టిలో చల్లబడటం వల్ల ఘ్రాణానందమూ కలుగిస్తాయి. పౌర్ణమి మొదలైన పుణ్య దినాలలో ప్రజలు నదీస్నానం చేస్తారు, శరీరానికి ,మనస్సుకూ తాపోపశమనం పొంది వారిజీవితాలను ధన్యం చేసుకుంటారు.

--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు

ప్రస్తావ పారిజాతం- 12 విషయం -- మానవశరీరం

 🎀 ప్రస్తావ-పారిజాతః- 12 🎁
ప్రస్తావ పారిజాతం- 12 (సంస్కృతలేఖ - తెలుగు అనువాదం)
--------------------------
🌷

సంస్కృతరచన- సంకా ఉషారాణి
తెలుగు అనువాదం- పులిపాక వేంకట లక్ష్మీకాంత రావు
🌸

🌻 ప్రస్తావవిషయః -- మానవశరీరమ్ 🌼
మనుష్యః పృథివ్యాం సృష్టేషు సమస్తప్రాణిషు విశిష్టః। సః నైకేషు అంశేషు అన్యజన్తూన్ అతిరిచ్య వరీవర్తి। తస్య శరీరనిర్మాణమత్ర ప్రధానకారణమ్। మానవశరీరం స్థూలసూక్ష్మకారణేతి భేదేన త్రివిధమస్తి। స్థూలశరీరం శిరో-నేత్ర-కరచరణాదిభిః అవయవైః సహితం చక్షుర్గోచరమస్తి। తత్ స్ప్రష్టుమపి శక్నుమః। తస్య పోషణం అన్నేన, జలేన, దుగ్ధేన, ఫలాహారాదినా చ భవతి। కిన్తు సూక్ష్మకారణశరీరే న తథా। సూక్ష్మశరీరం నామ, పఞ్చకర్మేన్ద్రియైః, పఞ్చజ్ఞానేన్ద్రియైః, మనోబుద్ధ్యాది-అన్తఃకరణచతుష్టయేన చ సంయుక్తం రూపమ్। మనసః పోషణం చ ధ్యానాదినా భవతి ఇతి సన్తః కథయన్తి। మాతృపితృసంయోగేన ప్రాప్తమిదం నరస్య దేహం భక్తి-జ్ఞాన-కర్మ-యోగాదిభిః మార్గైః ధర్మార్థకామమోక్ష-చతుర్విధపురుషార్థానాం సాధనాయ ఉపయుక్తం భవతి। మానవమేధా అతీవసఙ్క్లిష్టం వస్తు వర్తతే లోకే। తస్యాః కార్యాచరణవిధానం విశిష్టం, అసమానం చ।
పుణ్యకర్మాచరణేన శరీరే అదృష్టా శక్తిః వర్ధతే। యోగినః ప్రాణాయామ-ధ్యానాదికర్మభిః పరిపుష్య కాయస్యాస్య ఉత్కృష్టతమామ్ ఉపయోగితాస్థితిం సాధయన్తి। తయా స్థిత్యా తే లోకస్యోపకారం కుర్వన్తి। మద్యపానాదిసేవనేన కేచన మన్దబుద్ధయః మహోత్కృష్టస్యాస్య ధర్మపరికరస్య దురుపయోగం కుర్వన్తి। తైః దుష్టాచరణైః, పాపాచరణైశ్చ అస్య దేహస్య శక్తిః క్రమేణ క్షీణా భవతి॥

-సంకా ఉషారాణి
----------------------------------------
 ప్రస్తావవిషయం -- మానవశరీరం
మనుష్యడు భూమిపైన సృష్టిలో సమస్తప్రాణులలో విశిష్టమైన వాడు.అతడు అనేక అంశాలలో ఇతర ప్రాణులకన్నా ప్రత్యేకంగా ఉంటాడు.అతని శరీరనిర్మాణమే దానికి ప్రధానకారణం. మానవశరీరం స్థూలసూక్ష్మకారణ భేదాలతో మూడు విధములు. స్థూలశరీరం శిరస్సు-నేత్రాలు-కరచరణాది అవయవాలతో కూడి కన్నులకు కనుపిస్తూ ఉంటుంది. దానిని తాకవచ్చుకూడా.దాని పోషణ అన్నము, నీరు, పాలు, ఫలాహారాదులతో జరుగుతుంది. కానీ సూక్ష్మ,కారణ శరీరాలు అలాకాదు.సూక్ష్మశరీరం అంటే, పఞ్చకర్మేన్ద్రియాలు, పఞ్చజ్ఞానేన్ద్రియాలు, మనోబుద్ధులు మొదలైన అన్తఃకరణ చతుష్టయాలతో కూడిన రూపము. మనసుకు పోషణ ధ్యానాదులతో కలుగుతుంది అని ఋషులంటారు. మాతృపితృసంయోగం వలన ప్రాప్తించిన ఈమానవ దేహం భక్తి-జ్ఞాన-కర్మ-యోగాది మార్గాలతో ధర్మార్థకామమోక్షాలనే చతుర్విధపురుషార్థాలను సాధించడానికి ఉపయోగపడుతుంది.మానవమేధ లోకంలో చాలా క్లిష్టమైనది. దాని కార్యాచరణవిధానం విశిష్టమూ, అసమానమూ కూడా.
పుణ్యకర్మాచరణం వలన శరీరంలో కానరాని శక్తి పెరుగుతుంది.యోగులు ప్రాణాయామ-ధ్యానాదికర్మలతో పరిపుష్టమైన శరీరాన్ని ఉత్కృష్టంగా ఉపయోగించే స్థితిని సాధిస్తారు.ఆ స్థితి వలన లోకోపకారం చేస్తారు. మద్యపానాదులను సేవించడం వల్ల కొందరు మందబుద్ధులు మహోత్కృష్టమైన ధర్మ పరికరాన్ని దురుపయోగం చేస్తారు. వారి దుష్టాచరణము, పాపాచరణముల వలన వారి శరీరంలో శక్తి క్రమేణ క్షీణిస్తుంది.

--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు

ప్రస్తావ పారిజాతం- 11 విషయం -- తీర్థక్షేత్రం

🎀 *ప్రస్తావ-పారిజాతః- 11* 🎁
*ప్రస్తావ పారిజాతం- 11 (సంస్కృతలేఖ - తెలుగు అనువాదం)*
--------------------------
🌷

సంస్కృతరచన- సంకా ఉషారాణి
తెలుగు అనువాదం- పులిపాక వేంకట లక్ష్మీకాంత రావు
🌸
🌷ప్రస్తావవిషయః -- తీర్థక్షేత్రమ్; 🌻
ధర్మార్థకామమోక్షాః చతుర్విధపురుషార్థాః। తత్ర ధర్మసాధనాయ వివిధాః యజ్ఞ-హోమ-దాన-వ్రత-తపః-సేవాదిమార్గాః ఉక్తాః సనాతనధర్మగ్రన్థేషు। తే సర్వే ప్రయాస-ధనవ్యయాదివివిధైః క్లేశైః సాధ్యాః। అతః ప్రధానతయా సర్వత్ర సౌలభ్యం, సౌకర్యమ్, అక్లిష్టసాధ్యతామిచ్ఛన్తః మానవాః ధర్మార్జనాయ తీర్థక్షేత్రసన్దర్శనమార్గమనుసరన్తి। తీర్థక్షేత్రం నామ అత్యన్తం పవిత్రం స్థలమ్। తీర్థమితి క్లీబశబ్దః ‘తరతి పాపాదికం యస్మాత్' ఇతి పుణ్యస్థానాది వాచయతి। తీర్థతోయస్య స్నానేన పుణ్యం వర్ధతే। తీర్థజలస్పర్శనమాత్రేణాపి పాపక్షయో భవతి। శరీరం, ప్రాణాః, మనశ్చ తీర్థసన్దర్శనేన శుద్ధీభవన్తి। మనసః పరిశుద్ధిం వినా భక్తిః, జ్ఞానం, యోగో వా న సాధ్యన్తే। గఙ్గాతీర్థం సర్వస్మాత్ ఉత్తమం తీర్థమ్। ‘తీర్థతోయం తతః పుణ్యం గఙ్గాతోయం తతోఽధికమ్' ॥ ఇత్యాద్యే వహ్నిపురాణే స్నానవిధిర్నామాధ్యాయే ఉక్తమ్। తీర్థం నామ ప్రధానతయా జలమేవ। నదీపరిసరప్రాన్తః సమస్తః పరమపావనో భవతి। తీర్థక్షేత్రేషు దేవాలయాః వర్తన్తే, యత్ర మహాభక్తానాముద్భవః సమయే సమయే భవతి। తే తీర్థస్థానే లబ్ధజన్మానః భగవచ్చిన్తనే మగ్నాః చ జన్మ సార్థకం కృత్వా తరన్తి, అన్యాన్ తారయన్తి చ। తీర్థక్షేత్రవాసస్తు మహాపుణ్యఫలరూపేణ ప్రాప్యతే॥

-సంకా ఉషారాణి
----------------------------------------
ప్రస్తావ విషయం- తీర్థక్షేత్రం

ధర్మ అర్థ కామ మోక్షాలు నాలుగు విధాలైన పురుషార్థాలు. అందు ధర్మసాధన కోసం అనేక యజ్ఞ,హోమ,దాన,తపస్సులు,సేవాది మార్గాలు సనాతన ధర్మ గ్రంథాలలో చెప్పబడినాయి.అవి అన్నీ కూడా ప్రయాసతో,ధనవ్యయాది వివిధ క్లేశాలతో సాధ్యమైనవి . అందువల్ల ప్రధానంగా అంతటా లభించేదీ, సులువైనదీ, కష్టం లేకుండా చేయగలిగినదీ కోరుకునే మానవులు ధర్మసాధనకు తీర్థక్షేత్ర సందర్శన మార్గాన్ని అనుసరిస్తారు. తీర్థ క్షేత్రం అంటే చాలా పవిత్రమైన స్థలము.తీర్థమనే నపుంసక లింగ పదానికి అర్థం పాపాలను తరింపజేసేది అని అంటారు.
తీర్థజలాలలో స్నానం వలన పుణ్యం పెరుగుతుంది. తీర్థజలాలను తాకినంత మాత్రాన పాపాలు పోతాయి.శరీరము, ప్రాణము, మనస్సు తీర్థసందర్శనంతో శుద్ధమవుతాయి.మనస్సు పరిశుద్ధంగా లేకుండా భక్తి జ్ఞాన యోగాలు అసాధ్యం.
గంగా తీర్థం అన్నింటియందు ఉత్తమ తీర్థం.
'తీర్థతోయం తతః పుణ్యం గఙ్గాతోయం తతోఽధికమ్' అంటారు.అంటే తీర్థజలము వలన పుణ్యం,గంగా జలమువల్ల అంకంటే అధిక పుణ్యము, అని ప్రధమంగా వహ్ని (అగ్ని) పురాణంలో స్నానవిధి అనే అధ్యాయంలో చెప్పబడింది.తీర్థమంటే ప్రధానంగా నీరే. నదీ పరిసర ప్రాంతాలు అన్నీ పరమ పావనములుగా ఉంటాయి.ఎక్కడైతే మహా భక్తులు మాటిమాటికీ పుడుతూ ఉంటారో అక్కడ
తీర్థక్షేత్రాలలో దేవాలయాలు ఉంటాయి.
ఆ తీర్థ క్షేత్రాలలో పుట్టినవారు భగవధ్యానంలో మునిగి తమ జన్మలను సార్థకం చేసుకొని తరించి ఇతరులను కూడా తరింప జేస్తారు.తీర్థక్షేత్రనివాసం అతి మహాపుణ్య ఫల రూపంలో ప్రాప్తిస్తుంది.

--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు


ప్రస్తావ పారిజాతం- 10 విషయం -- మేఘం

🎀 *ప్రస్తావ-పారిజాతః- 10* 🎁
*ప్రస్తావ పారిజాతం- 10 (సంస్కృతలేఖ - తెలుగు అనువాదం)*
--------------------------
🌷

సంస్కృతరచన- సంకా ఉషారాణి
తెలుగు అనువాదం- పులిపాక వేంకట లక్ష్మీకాంత రావు
🌸

🌸ప్రస్తావవిషయః -- మేఘః; 🌧
మేఘశబ్దశ్రవణేన ఝటితి వయం ధూమజ్యోతిఃసలిలమరుతాం సంనిపాతః క్వ మేఘః—ఇతి కాలిదాసోక్తిం స్మరామః। మేహతి సిఞ్చతీతి మేఘః। మేఘేన వినా జలం, జలేన వినా సస్యం, సస్యేన వినా అన్నం చ న సమ్భవన్తి। అతః మేఘః ఏవ అన్నస్యోత్పాదనే ప్రధానకారణమ్। మేఘాః నానావిధాకృతీః ధృత్వా, కుత్రచిత్ గచ్ఛన్తః యాత్రికా ఇవ, ఆకాశే విహరన్తః నిత్యపథికా ఇవ అత్యన్తం శోభన్తే। తే వాయునా నీతాః కుత్రచిత్ విహారయాత్రాం కర్తుం యాతా ఇవ శనైః చరన్తి। సాయఙ్కాలేషు, ప్రాతఃసమయేషు చ నైకే మేఘాః సమ్మేల్య వాయోః దిశి ప్రయాతాః, పరస్పరం సఁల్లపన్తః ఇవ దృశ్యన్తే। నభసి క్షణం క్షణం రూపం పరివర్తయన్తస్తే, భగవతా విశ్వకర్త్రా క్షేపితాః తూలరాశయ ఇవ దృశ్యమానాః మోదయన్తి దర్శకాన్। మేఘాన్ దృష్ట్వా కవయః కవిత్వం లిఖన్తి, చిత్రకారాః వర్ణచిత్రాణి రచయన్తి, గీతకారాశ్చ గీతాని గాయన్తి। న కేవలం మానవాః అపి తు పక్షిణః, పశవోఽపి మేఘగర్జనేన నన్దన్తి। వర్షాగమనం సూచయత్ మేఘనాదం శ్రుత్వా మయూరాః యన్నృత్యం కుర్వన్తి, తత్ దృష్ట్వా కశ్చిత్ చలచిత్రగీతకవిః ఏవం ఊహతే- "మమ కామనా భవతి, మయూరస్య పాదయోః నూపురాణి ధారయేయమ్" ఇతి॥

-సంకా ఉషారాణి
----------------------------------------
ప్రస్తావ విషయం-- మేఘము
మేఘం అనే మాట విన్న వెంటనే మనము--
ధూమజ్యోతిఃసలిలమరుతాం సంనిపాతః క్వ మేఘః--
అనే కాళిదాసు మాటని స్మరిస్తాము. మేహతి(జారును),సిఞ్చతి(చల్లును) కనుక మేఘము. మేఘం లేక నీరు, నీరు లేక పంట, పంట లేక అన్నము ఉండవు. అందువల్ల మేఘమే అన్నం యొక్క ఉత్పత్తికి ప్రధాన కారణం.
మేఘాలు నానా విధాలైన ఆకారాలను ధరించి ఎక్కడికో వెళ్ళే యాత్రికుల లాగా ఆకాశంలో విహరిస్తూ నిత్య యాత్రికుల వలె ఎంతో శోభగా ఉంటాయి. అవి గాలిచేత తీసుకొని పోబడుతూ ఎక్కడికో విహారయాత్రకు వెళ్తూ ఉన్నట్లు నెమ్మదిగా కదులుతూ ఉంటాయి.
సాయం సమయాలలో,ప్రాతః కాలాలలోనూ అనేక మేఘాలు కూడి గాలివాటున ప్రయాణిస్తూ వానిలో అవి మాట్లాడుకుంటున్నట్లు కనిపిస్తాయి. ఆకాశంలో క్షణక్షణానికి రూపం మార్చుకుంటూ అవి విశ్వకర్తయైన భగవంతుని చేత ఉంచబడిన తూలికల(చిన్న మృదువైన ఈకలు) రాశిలా కనుపిస్తూ చూచేవారిని ఆనందింపజేస్తాయి.మేఘాలను చూసి కవులు కవిత్వాన్ని వ్రాస్తారు, చిత్రకారులు రంగుల చిత్రాలను వేస్తారు, గాయకులు గేయాలు పాడుతారు. కేవలం మానవులే కాక పక్షులు, పశువులు కూడా మేఘగర్జనల చేత ఆనందిస్తాయి. వర్షాగమనాన్ని సూచించే మేఘనాదాన్ని విని నెమళ్ళు చేసే నృత్యాన్ని చూసి ఒక సినిమా కవి ఇలా ఊహిస్తాడు--- నెమళ్ళకాళ్ళకు గజ్జెలు కట్టాలని నా కోరిక, అని.

--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు

ప్రస్తావ పారిజాతం- 9 విషయం – దూరధ్వని

🎀 *ప్రస్తావ-పారిజాతః- 9* 🎁
*ప్రస్తావ పారిజాతం- 9 (సంస్కృతలేఖ - తెలుగు అనువాదం)*
--------------------------
🌷

సంస్కృతరచన- సంకా ఉషారాణి
తెలుగు అనువాదం- పులిపాక వేంకట లక్ష్మీకాంత రావు
🌸

🌸 ప్రస్తావవిషయః – దూరధ్వనిః 🌧
దూరధ్వనిః ధ్వనిరూపేణ గీత-ప్రవచన-వార్తా-నాటక-సమ్ముఖాది-నానావిధ-కార్యాక్రమాణి ప్రసారయతి। అనేన యన్త్రేణ దూరధ్వని-స్థానకాత్ ప్రసారితాన్ కార్యక్రమాన్ విద్యుత్-అయస్కాన్తీయ-తరఙ్గైః వాయౌ ప్రక్షేపితాని భూత్వా అస్మాభిః గృహే స్థిత్వా శ్రవ్యరూపేణ శ్రూయన్తే। ఆకాశవాణీతి నామ్నా ప్రసిద్ధమిదం సాధనం దృశ్యేన వినాపి సాధారణజనానాం కృతే వరమివ వర్తతే, యతో హి తత్ర చక్షుర్భ్యాం దర్శనస్యావశ్యకతా నాస్తి। కార్యం కుర్వన్తోఽపి జనాః తత్ వినాక్లేశం శ్రోతుం శక్నువన్తి యేన కార్యాణి స్థగితాని న భవన్తి। దూరదర్శన్యాః అత్యన్తం విస్తృతతయా ప్రవృత్తేః పశ్చాద్ అధునాపి మహతా ఆనన్దేన దూరధ్వనిప్రేమిణః దూరధ్వనిం శృణ్వన్తి। తత్ర సర్వం ధ్వనిరేవ భవతి। అతః దూరదర్శిన్యాం దుష్టకార్యక్రమాణాం దర్శనేన యా హానిః ఘటతే, సాత్ర న సమ్భవతి॥

-సంకా ఉషారాణి
----------------------------------------
ప్రస్తావవిషయం -దూరధ్వని
దూరధ్వని శబ్దరూపంలో గీతా ప్రవచనాలు,వార్తలు, నాటకాలు, సమ్ముఖములు మొదలైన నానావిధ కార్యక్రమాలను ప్రసారం చేస్తుంది. ఈ యంత్రంతో దూరధ్వని స్థానకం నుండి ప్రసారమయ్యే కార్యక్రమాలు విద్యుదాయస్కాంత తరంగాలద్వారా గాలిలో ప్రక్షేంచబడినవానిని ఇంటిలోనే ఉండి మన చేత శ్రవ్యరూపంలో వినబడతాయి.
ఆకాశవాణి అనే పేరుతో ప్రసిద్ధమైన ఈ సాధనం దృశ్యం లేకుండానే సామాన్య ప్రజలకు వరంలా ఉంది.అక్కడ కళ్ళతో చూచే పనిలేదు. పని చేసుకుంటూ కూడా ప్రజలు కష్టం లేకుండా వినగలుగుతారు కనుక పనులు ఆగవు.
దూరదర్శనులు చాలా విస్తృతంగా ఉన్నా , ఇప్పటికీ చాలా ఆనందంగా దూరధ్వని అభిమానులు దూరధ్వనిని వింటారు. అక్కడ అంతా శబ్దరూపంలోనే ఉంటుంది.
అందువల్ల దూరదర్శిని లో దుష్ట కార్యక్రమాలను చూడటం వల్ల ఏ హాని కలుగుతుందో అది ఇక్కడ కలుగదు.

--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు


ప్రస్తావ పారిజాతం- 8 విషయం - దూరదర్శినీ

🎀 *ప్రస్తావ-పారిజాతః- 8* 🎁
*ప్రస్తావ పారిజాతం- 8 (సంస్కృతలేఖ - తెలుగు అనువాదం)*
--------------------------
🌷

సంస్కృతరచన- సంకా ఉషారాణి
తెలుగు అనువాదం- పులిపాక వేంకట లక్ష్మీకాంత రావు
🌸

🌸 ప్రస్తావవిషయః - దూరదర్శినీ 🎀
ఆధునికసమయే దూరదర్శినీరహితం గృహం వా ఆవాసక్షేత్రం వా ఊహితుమపి న శక్నుమః। దృశ్య-శ్రవ్యయోగేన వక్తవ్యం వస్తు సుస్పష్టం జనానాం మానసాని యథా ప్రవిశేత్ తథా ప్రదర్శనాయ వ్యవస్థాం కరోతి ఏషా మాయాపేటికా। దూరదర్శినీ-స్థానకే నిర్మితానాం కార్యక్రమాణామ్ అదృష్టాః తరఙ్గాః వాయౌ ప్రక్షేపితాః (ప్రసారితాః) భూత్వా దూరదర్శినీయన్త్రం ప్రవిశ్య దృశ్యశ్రవ్యచిత్రరూపేణ చక్షుగోచరాః భవన్తి। దూరదర్శినీ పూర్వం శ్వేతశ్యామ-ఇతి ద్వివర్ణకమాత్రం భవతి స్మ। ఇదానీం తద్యన్త్రం సర్వవర్ణకం భవతి యత్ర చలచిత్రాణి నానావిధవర్ణేషు దృశ్యన్తే। వైజ్ఞానికవిషయాణాం, సామాజికోపయోగివిషయాణాం, శిక్షా-ప్రశిక్షణవస్తూనాం నైకే సమాచారాః అనేన మాధ్యమేన కాఠిన్యం వినా ప్రసార్యన్తే। ఏకత్ర చిత్రనిర్మాణం కృత్వా సర్వత్ర తస్య ప్రసారణం కర్తుం శక్యతే। దేశః విదేశః ఇతి అవధిరపి అత్ర నాస్తి। బాలానాం, వృద్ధానాం, స్త్రీణాం, వివిధవృత్తివర్గకార్యకర్తౄణాం సామాన్యజనానాం కృతే ఏషా విశ్వదర్శినీ భూత్వా గృహే ఏవ సర్వం జగత్ దర్శయతి। సమీచీనోపయోగేన తద్వస్తు మహోపకారం కుర్యాత్, పరన్తు ఆధునికకాలే తస్య హానికారకప్రయోగేణ మహాన్ ప్రలయః సమ్భవిష్యేత్ ఇవ దృశ్యతే। యువజనాః, బాలాశ్చ మానవమేధసే, హృదయాయ చ వినాశకారకభావానాం పఙ్కే మజ్జన్తే। నేదం హర్షాస్పదమ్॥
--సంకా ఉషారాణి
----------------------------------------
ప్రస్తావవిషయం- దూరదర్శనీ

ఆధునిక కాలంలో దూరదర్శిని లేని ఇల్లు కానీ నివాసం కానీ ఊహించలేము. దృశ్య శ్రవణ యోగ్యంగా చెప్పదలచిన విషయం ఎలా స్పష్టంగా ప్రజల మనసులలోకి ఎలా చేరుతుందో అలా ప్రదర్శించే వ్యవస్థ ఈ మాయపెట్ఠె చేస్తుంది.
దూరదర్శిని నిలయంలో నిర్మించబడే కార్యక్రమాలు
అదృశ్య తరంగాల ద్వారా గాలిలో నిండి దూరధర్శన యంత్రంలో ప్రవేశించి దృశ్య శ్రవణ రూపంలో కనుపిస్తాయి. దూరదర్శిని పూర్వం తెలుపు నలుపు రెండు రంగులలోనే ఉండేది. చలన చిత్రాలు ఎలా అయితే నానా వర్ణాలలో ఉన్నాయో అలా ఇప్పుడు అన్ని రంగులలో ఉన్నది.
వైజ్ఞానిక విషయాలు, సమాజానికి ఉపయోగపడే విషయాలు, శిక్షణ అభ్యాస విషయాలు అనేక సమాచారాలు ఈ మాధ్యమంలో కష్టం లేకుండా ప్రసారమవుతాయి.
ఒక చోట చిత్రాన్ని నిర్మించి అంతటా దానిని ప్రసారం చేయవచ్చు. దేశం పరదేశం అనే హద్దులు లేవు.
స్త్రీ బాలవృద్ధులకు, నానా వృత్తులలో ఉన్న వారికీ, సామాన్యజనానికీ ఇది విశ్వదర్శని అయి ఇంటి లోనే సర్వ ప్రపంచాన్ని చూపిస్తుంది. సక్రమంగా ఉపయోగిస్తే ఆ వస్తువు గొప్ప మేలు చేస్తుంది కానీ ఆధునిక కాలంలో దాని హానికారక ప్రయోగం వలన గొప్ప ప్రళయం వస్తుందని పిస్తున్నది. యువకులు, పిల్లలు మనుష్యులు మానసికంగా, హార్దికంగానూ వినాశకర భావనలనే బురదలో మునిగి పోతున్నారు.ఇది సంతోషదాయకం కాదు.

--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు


ప్రస్తావ పారిజాతం-7 విషయం - వీరసైనికులు

 🎀 *ప్రస్తావ-పారిజాతః-7* 🎁
*ప్రస్తావ పారిజాతం-7 (సంస్కృతలేఖ - తెలుగు అనువాదం)*
--------------------------
🌷

సంస్కృతరచన- సంకా ఉషారాణి
తెలుగు అనువాదం- పులిపాక వేంకట లక్ష్మీకాంత రావు

⚔ప్రస్తావవిషయః - వీరసైనికాః; 💣
సైనికః నిర్భయః పర్యన్తభూమౌ స్థిత్వా దేశరక్షణం కరోతి। సః శత్రుభిః పరాక్రమేణ యుధ్యతే। భారతసైనికాః జగతి శౌర్యాయ, విక్రాన్తతాయై చ సువిఖ్యాతాః సన్తి। అనుశాసనస్య, సదాచారస్య చ భారతసైనికాః నిరుపమానోదాహరణాని సన్తి। ఇమే మహతా ప్రయాసేన శరీరం శోషయిత్వా, తాపయిత్వా చ యుద్ధవిద్యాః శిక్షన్తే। తే నదీకూల-పర్వతశిఖర-మరుభూమి-సముద్రతటాది-నానావిధప్రాన్తేషు పత్నీపుత్రగృహాదికం త్యక్త్వా ఏకాకినః తిష్ఠన్తి। జలోపప్లవ-భూకమ్ప-జాతికలహాదిషు ఉపద్రవేషు సత్సు ప్రశాసనేన తేషాం సాహాయ్యం స్వీక్రియతే। స్వక్లేశమవిగణయ్య తే సేవాం కుర్వన్తి। యుద్ధం కుర్వన్తస్తే ప్రాణైః వియుక్తా అపి వీరస్వర్గం ప్రాప్తమితి తుష్యన్తి। గృహాద్వియుక్తాః దూరే శిబిరేషు తిష్ఠన్తి। కుటుమ్బసుఖాత్ తే సదా విప్రకృష్టాః సర్వకాలం దేశహితస్య చిన్తకాః సన్తః ఆదినం చతుర్వింశతిహోరామితకాలమపి కార్యశీలాశ్చ భవన్తి। ఇష్టమిష్టభిన్నమితి తేషాం ద్వన్ద్వం నాస్తి। యదధికారిభిరుచ్యతే, తత్ అవిచలితమ్ ఆచరన్తి। యుద్ధే సతి, విపత్తికాలే చాగతే తే వివేకం, శౌర్యం, పరాక్రమఞ్చ దర్శయన్తః శత్రూన్ ఘ్నన్తి। ప్రతికూలస్థితౌ ఆపన్నాయాం నిఃసఙ్కోచం స్వప్రాణానపి త్యజన్తి।తానహం నమామి మహత్యా శ్రద్ధయా యుక్తా॥

-సంకా ఉషారాణి
----------------------------------------
ప్రస్తావ విషయం-వీరసైనికులు

సైనికుడు నిర్భయంగా సరిహద్దులలోఉండి దేశాన్ని రక్షిస్తాడు. అతడు శత్రువులతో పరాక్రమంతో యుద్ధం చేస్తాడు. భారత సైనికులు ప్రపంచంలో శౌర్యానికి, విక్రమానికీ మంచి పేరున్నవారు. క్రమశిక్షణ,సదాచరణకు కూడా బారత సైనికులు సాటిలేని ఉదాహరణగా ఉంటారు. వీరు చాలా ప్రయాసతో శరీరాన్ని వాతాపములకు గురిచేస్తూ యుద్ధవిద్యలను నేర్చుకుంటారు. వారు నదీ తీరాలు,పర్వత శిఖరాలు, ఎడారులు, సముద్రతీరాలు మొదలైన నానా ప్రదేశాలలో భార్యా పుత్ర గృహాదులను విడిచి పెట్టి ఒంటరిగా ఉంటారు.
వరదలు, భూకంపాలు, జాతి కలహాలు మొదలైన ఉపద్రవాలలో ప్రభుత్వం చేత వారి సహాయం స్వీకరించబడుతుంది. వారు తమ కష్టాన్ని పట్టించుకోకుండా సేవ చేస్తారు.
యుద్ధం చేస్తూ వారు ప్రాణాలు విడిచినా వీరస్వర్గం ప్రాప్తిస్తుందని సంతోషిస్తారు. ఇంటిని విడిచి దూరంగా గుడారాలలో ఉంటారు. కుటుంబ సౌఖ్యాలనుండి ఎప్పుడూ దూరమై, ఎప్పుడూ దేశము యొక్క హితాభిలాషులై ఉంటారు.
రోజంతా ఇరవైనాలుగు గంటలూ పనిచేస్తూనే ఉంటారు. వారికి ఇష్టాయిష్టాలు ఉండవు.
అధికారులకు ఏది ఇష్టమో దానిని నిశ్చలంగా చేస్తారు.
యుద్ధం వస్తే, ఆపత్కాలంలోవారు వివేకము, శౌర్యము, పరాక్రమము తో శత్రువులను సంహరిస్తారు. ప్రతికూల పరిస్థితులలో ఆపదలో నిస్సంకోచంగా తమ ప్రాణాలను సైతం త్యజిస్తారు.
వారికి నేను గొప్ప శ్రద్ధతో నమస్కరిస్తున్నాను.

--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు

ప్రస్తావ పారిజాతం-6 విషయః - కార్తికమాసప్రాశస్త్యం

 🎀 *ప్రస్తావ-పారిజాతః-6* 🎁
*ప్రస్తావ పారిజాతం-6 (సంస్కృతలేఖ - తెలుగు అనువాదం)*
--------------------------
🌷

సంస్కృతరచన- సంకా ఉషారాణి
తెలుగు అనువాదం- పులిపాక వేంకట లక్ష్మీకాంత రావు

🌴ప్రస్తావవిషయః - కార్తికమాసప్రాశస్త్యమ్; 🌸
కార్త్తికమాసః మహాశుభసమయః। అస్మిన్ మాసే శివపూజా క్రియతే। అల్పీయసా ఆరాధనేన అనల్పం ఫలం లభతే నరః ఇతి పురాణాని ఉద్ఘోషయన్తి। కార్త్తికమాసే శివభక్తాః ప్రాతఃకాలే ఉత్థాయ స్నాత్వా, శివాభిషేకాదికం కుర్వన్తి। శివమన్దిరేషు బహవః జనాః దృశ్యన్తే। సూర్యోదయాత్ పూర్వమేవ దర్శనార్థం మహత్యా భక్త్యా గచ్ఛన్తి। తత్ర శాన్తం, లిఙ్గస్వరూపం, త్రినేత్రధారిణం శివం సకృదపి దృష్ట్వా ప్రణమ్య స్వజన్మ ధన్యం మన్యన్తే। కేచన ఉపవాసాదినా, కేచన స్తోత్రాదిపఠనేన, కేచిచ్చ భజనగానాదినా దేవమర్చన్తి। ఆమాసం శివనామజపేన, శివధ్యానేన చ శుభఫలాని లభన్తే।
కార్త్తికవ్రతం మహాపుణ్యప్రదాయకం వర్తతే। సూర్యే తులారాశౌ స్థితే ఆమాసం నదీస్నానమాచర్య, దేవాలయం గత్వా హరిహరాదీనామారాధనం కర్తవ్యమ్। యథాశక్తి దీపదానం కరణీయమ్। రాత్రివేలాయాం వైష్ణవాలయే, అథవా శివమన్దిరే గోఘృతేన దీపారాధనం కర్తవ్యమ్। అస్మిన్ మాసే ప్రతిదినం సాయంకాలే శివపురాణం, స్కాన్దపురాణాన్తర్గత-వశిష్ఠప్రోక్త-కార్త్తికమాహాత్మ్యస్య చ పారాయణం కుర్వన్తి జనాః। యది ఆమాసం కర్తుం న పారయన్తి, తర్హి ఏకస్మిన్ పౌర్ణమాస్యాం వా కర్తుం శక్యతే। అస్మిన్ మాసే ధన-ధాన్య-కనక-గృహ-కన్యా-ఇత్యాదిదానైః, తీర్థాటనేన, కావేరీ-గఙ్గా-గౌతమీ-నదీష్వన్యతమాయాం స్నాత్వా, పురాణాదికం పఠిత్వా, నిత్యహరినామస్మరణేన వా అఖణ్డం పుణ్యం లభ్యతే। సకలైశ్వర్యాణి ప్రాప్య పుణ్యలోకాన్ చ ప్రాప్నోతి।
--సంకా ఉషారాణి
----------------------------------------
ప్రస్తావ విషయం-కార్తికమాస ప్రాశస్త్యము

కార్తికమాసం గొప్ప శుభసమయం. ఈ మాసంలో శివపూజ చేస్తారు. అల్పపూజతో అనల్పమైన ఫలం నరులకు లభిస్తుందని పురాణాలు ఘోషిస్తున్నాయి. కార్తికమాసంలో శివభక్తులు ప్రాతఃకాలంలో నిద్రలేచి స్నానం చేసి శివాభిషేకం చేస్తారు. శివాలయాలలో చాలామంది భక్తులు కనిపిస్తారు. సూర్యోదయానికి ముందే చాలామంది భక్తులు దర్శనార్థం వెళ్తారు. అక్కడ
శాంతుడు,లింగస్వరూపుడు, త్రినేత్రధారి అయిన శివుణ్ణి ఒకసారైనా చూసి ప్రణమిల్లి తమ జన్మ ధన్యమైందని తలుస్తారు.
కొందరు ఉపవాసాదులతో, కొందరు స్తోత్ర పఠనాదులతో, కొందరు భజనలు పాటలతో దేవుణ్ణి పూజిస్తారు.
మాసమంతా శివనామ జపంతో,శివధ్యానంతోనూ శుభఫలాలు కలుగుతాయి.
కార్తిక వ్రతం మహాపుణ్యదాయకం. సూర్యుడు తులారాశిలో ఉండగా మాసమంతా నదీస్నానం చేసి, దేవాలయానికి వెళ్ళి హరిహరులను ఆరాధించాలి. యథాశక్తి దీపదానం చేయాలి. రాత్రి సమయాలలో వైష్ణవాలయాలలో, శివాలయాలలో ఆవునెయ్యితో దీపారాధన చేయాలి. ఈ మాసంలో ప్రతిరోజూ సాయంత్రం భక్తులు శివపురాణం, స్కాందపురాణంలోని వశిష్ఠ ప్రోక్తమైన కార్తికమహాత్మ్య పారాయణం చేస్తారు.
ఒకవేళ మాసమంతా చేయలేకపోతే, పౌర్ణమి నాడైనా చేయవచ్చును. ఈ మాసంలో ధన-ధాన్య-కనక-గృహ-కన్యా దానాదులచేతను, తీర్థయాత్రలను చేసి, కావేరీ,గంగా,గౌతమీవంటి నదులలో స్నానం చేసి, పురాణపఠణాదులు చేసి, నిత్య హరినామస్మరణతోనూ అఖండమైన పుణ్యం లభిస్తుంది. సకలైశ్వర్యాలూ కలిగి పుణ్యలోకాలు కూడా ప్రాప్తిస్తాయి.

--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు

ప్రస్తావ పారిజాతం-5 విషయం - పుస్తకం

🎀 *ప్రస్తావ-పారిజాతః-5* 🎁
*ప్రస్తావ పారిజాతం-5 (సంస్కృతలేఖ - తెలుగు అనువాదం)*
--------------------------
🌷

సంస్కృతరచన- సంకా ఉషారాణి
తెలుగు అనువాదం- పులిపాక వేంకట లక్ష్మీకాంత రావు

📔ప్రస్తావవిషయః - పుస్తకమ్; 📚
    పుస్తకం జ్ఞానసాధనమితి అస్మిన్ దేశే తత్ పూజ్యవస్తు అస్తి। పుస్తకాని సన్మిత్రాణీవ సర్వాన్ నన్దయన్తి, విజ్ఞానప్రదానేన ఉపకుర్వన్తీతి విద్వజ్జనానాం మహానాదరః తేషు। బాలః, విద్యార్థీ వా పుస్తకహస్తః శోభతే। లోకే నానావిధ-పుస్తకాని భవన్తి। న సర్వాణి ఉపయుక్తాని భవన్తి। మనుష్యం యథా ముఖేన సః కీదృశ ఇతి విజ్ఞాతుం న శక్యతే, తథైవ పుస్తకమపి తస్య బాహ్యావరణం దృష్ట్వా సద్వస్తుపూర్ణం న వేతి న వక్తుం శక్యతే।
    పుస్తకం సత్కాలక్షేపాయ హితకరమార్గః। అన్యమనుష్యస్య సాఙ్గత్యాపేక్షయా వినా సర్వదేశ-సర్వకాల-సర్వావస్థాసు ప్రకాశమాత్రసత్త్వే పుస్తకపఠనం శక్యతే। పుస్తకాని విద్యావతః మనుష్యస్య మిత్రాణీవ। పూర్వమదృష్టప్రదేశానాం, అగతదేశానాం, జీవనవిధానానాం, వస్తూనాం, నానాప్రకారక-విజ్ఞానానాం చ సమాచారం తత్తద్విషయమధికృత్య లిఖితానాం పుస్తకానాం పఠనేన హస్తామలకమివ సుస్పష్టం భవతి। నానావిషయకాని పుస్తకాని సన్తి లోకే। యస్మై యద్రోచతే, తస్మిన్ లిఖతి పుస్తకం, ముద్రాపయతి, అన్యచ్చ తత్ క్రీత్వా పఠతి। పురా పణ్డితైః పుస్తకాని మహతా శ్రమేణ, ధనవ్యయేన చ భూర్జ-తాలాది-పత్రేషు లేఖ్యన్తే స్మ లిపికైః। కిన్తు అధునా తేషాం ముద్రణం భవతి, యేన అల్పకాల-ధన-శ్రమవ్యయేన పుస్తకం హస్తే అవతరతి॥
----------------------------------------

ప్రస్తావ విషయం- పుస్తకం

పుస్తకం జ్ఞానసాధనమని మన దేశంలో అది పూజనీయమైన వస్తువు.
పుస్తకాలు మంచి స్నేహితుల వలె అందరినీ ఆనందింపజేస్తాయి.
‌విజ్ఞానాన్ని ప్రసాదించడానికి ఉపకరిస్తాయని విద్వాంసులకు వానియందు మహా ప్రీతి. బాలుడు కానీ, విద్యార్థి కానీ పుస్తకం పట్టుకుని ఉంటే శోభిస్తాడు.
లోకంలో నానా రకాల పుస్తకాలు ఉంటాయి.
మనుష్యుని ముఖం చూసి ఎటువంటి వాడో తెలసుకోవటం వీలు కాదు. అలాగే పుస్తకాన్ని పైపైన చూచి దానిలో వస్తువు ఉందో లేదో చెప్పటం వీలుకాదు. సత్కాలక్షేపానికి పుస్తకం మంచి మార్గం. ఇతర మనుష్యులతో సంబంధం లేకుండా, అన్ని సమయాలలోనూ, అన్ని ప్రదేశాలలోనూ, అన్ని అవస్తలలోనూ వెలుగు మాత్రం ఉంటే చాలు పుస్తకం చదువుకోవచ్చు.
విద్యావంతులైన మనుష్యులకు పుస్తకాలే మిత్రులవంటివి.
పూర్వం చూడని ప్రదేశాలు,వెళ్ళని దేశాలు, జీవన విధానాలు, వస్తువులు, నానా విధాలైన విజ్ఞానము యొక్క సంగతులు ఆయా విషయాలను గురించి వ్రాయబడిన పుస్తకాలను చదవటంవల్ల అరచేతిలో ఉసిరికాయ వలె స్పష్ఠమవుతాయి.
లోకంలో నానా విషయాలగురించి పుస్తకాలున్నాయి.
ఎవరికి ఏది నచ్చుతుందో దానిని పుస్తకంగా వ్రాస్తారు, అచ్చువేయిస్తారు, ఇతరులు దానిని కొని చదువుతారు.
పూర్వం పండితులచేత పుస్తకాలు చాలా శ్రమతో, ధనవ్యయంతోనూ భూర్జ,తాళ పత్రాలలో గంటాలతో వ్రాసేవారు.
కానీ ఇప్పుడు వాటి ముద్రణ తక్కువ సమయంలో తక్కువ శ్రమతో తక్కువ ఖర్చుతో పుస్తకం చేతికొస్తున్నది.
--పులిపాక వేంకట లక్ష్మీకాంత రావు


ప్రస్తావ పారిజాతం-4 విషయం - భారతదేశం

🎀 *ప్రస్తావ-పారిజాతః-4* 🎁
*ప్రస్తావ పారిజాతం-4 (సంస్కృతలేఖ - తెలుగు అనువాదం)*
--------------------------
🌷

సంస్కృతరచన- సంకా ఉషారాణి
తెలుగు అనువాదం- పులిపాక వేంకట లక్ష్మీకాంత రావు
ప్రస్తావవిషయః - భారతదేశః; 🙏

భారతదేశో నామ జ్ఞానే ఆసక్తానాం భూమిః। భా=ప్రకాశః (జ్ఞానేన సాదృశ్యం ప్రకాశస్య), రతః=ఆసక్తః ఇతి। భారతీయతా నామ జ్ఞానతత్పరతా। దేశోఽయం సనాతనధర్మస్య జన్మస్థానమ్। ఋషీణాం మునీనాం తపోభూమిః। వీరాణాం త్యాగభూమిః।
దేవతాః అపి అత్ర లబ్ధజన్మభ్యః ఈర్ష్యన్తే ఇతి కథ్యతే। సుజల-నదీ-వన-పర్వతాది-నిసర్గసౌన్దర్యస్య, తీర్థస్థానానాం, పుణ్యక్షేత్రాణాం, రామాయణమహాభారతాదికృతీనాం కర్తౄణాం చ పవిత్రధరేయం మమ జన్మస్థానమితి అహం గర్వమనుభవామి।
జమ్బూ-ప్లక్ష-శాల్మల-కుశ-క్రౌఞ్చ-శాక-పుష్కరేతి సప్తద్వీపాః సన్తి యే క్రమశః లవణేక్షురస-సురా-ఘృత-దధి-దుగ్ధ-జల-ఇతి సప్తసముద్రైః పరివృతాః। జమ్బూమ్బూద్వీపస్య మధ్యే సువర్ణమయో మేరుపర్వతోఽస్తి। మేరోః దక్షిణే నవసహస్రయోజనమిత-విస్తరితః భారతవర్షోఽస్తి। కర్మభూమావస్యాం సకామసాధకానాం స్వర్గః, నిష్కామసాధాకనాఞ్చ మోక్షప్రాప్తిః చ సమ్భవతః।
అత్ర మహేన్ద్ర-మలయ-సహ్య-శుక్తిమత్-ఋక్ష-విన్ధ్య-పారియాత్రేతి సప్త కులపర్వతాః సన్తి। శతద్రూ-చన్ద్రభాగా-నర్మదా-కావేరీ-గోదావరీ-భీమరథీ-కృష్ణవేణీ-కృతామలా-తామ్రపర్ణీ-త్రిసన్ధ్యర్షికుల్యా-కుమారేత్యాదయః బహవః నద్యః పర్వతేభ్య ఏతేభ్యః నిఃసరన్తి యాసాం నామోచ్చారణేనాపి పాపాని హ్రియన్తే।
కురు-పాఞ్చాల-మధ్యప్రదేశ-పూర్వదేశ-కామరూప-పౌణ్డ్ర-కలిఙ్గ-మగధ-దక్షిణ-సౌరాష్ట్ర-శూద్రాభీరార్బుద-మరు-మాలవా-పారియాత్ర-సౌవీర-సింధ-శాల్వ-శాకల్య-మద్రామ్బష్ఠ-పారసీకాది-ప్రదేశాః సన్తి। ఇతోఽధిక-భారతదేశ-వర్ణనం బ్రహ్మపురాణే అస్తి॥
--ఉషారాణీ సంకా
----------------------------------------
ప్రస్తావ విషయం-భారత దేశము
భారత దేశం అంటే జ్ఞానమునందు ఆసక్తి కలవారి భూమి.
భా అంటే ప్రకాశం (జ్ఞానముతో సమానమైన వెలుగు )రత అంటే ఆసక్తి కలవారు అని.భారతీయత అంటే జ్ఞానాసక్తి.
ఈ దేశము సనాతన ధర్మానికి జన్మభూమి.
ఋషులకు మునులకు తపోభూమి.
వీరులకు త్యాగభూమి.
దేవతలు కూడా ఇక్కడ పుట్టిన వారిమీద ఈర్ష్య చెందుతారని అంటారు.
మంచినీటి నదులు, పర్వతాలు, అడవుల
సహజ సౌందర్యం, తీర్థ ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు,రామాయణ మహాభారతాది
కావ్యకర్తలకు పుట్టినిల్లయిన ఈ పవిత్ర భూమి నా జన్మభూమి అయినందుకు నేను గర్విస్తాను.
జమ్బూ-ప్లక్ష-శాల్మల-కుశ-క్రౌఞ్చ-శాక-పుష్కరాలనే సప్తద్వీపాలను వరుసగా లవణ ఇక్షురస-సురా-ఘృత-దధి-క్షిర-జలములనే సప్తసముద్రాల చేత చుట్టబడి ఉంది. జంబూ ద్వీపంలో బంగారు మేరు పర్వతం ఉంది. మేరు పర్వతానికి దక్షిణాన తొమ్మిది వేల యోజనాల విస్తీర్ణం గల భారతవర్షమున్నది. ఈ కర్మభూమి యందు
సకామ సాధకులకు స్వర్గప్రాప్తి, నిష్కామ సాధకులకు మోక్షప్రాప్తి కలుగుతుంది.
ఇక్కడ మహేన్ద్ర-మలయ-సహ్య-శుక్తిమత్-ఋక్ష-విన్ధ్య-పారిత్రయములనే సప్త కులపర్వతాలు కలవు.
పర్వతాలనుండి పుట్టి ప్రవహిస్తున్న శతద్రూ-చన్ద్రభాగా-నర్మదా-కావేరీ-గోదావరీ-భీమరథీ-కృష్ణవేణీ-కృతామలా-తామ్రపర్ణీ-త్రిసన్ధ్య ఋషికుల్యా-కుమారి మొదలైన చాలా నదుల పేర్లను స్మరించినా చాలు పాపాలు నశిస్తాయి.
కురు-పాఞ్చాల-మధ్యప్రదేశ-పూర్వదేశ-కామరూప-పౌణ్డ్ర-కలిఙ్గ-మగధ-దక్షిణ-సౌరాష్ట్ర-శూద్ర -అభీర- అర్బుద-మరు-మాళవ-పారియాత్ర-సౌవీర-సధ-శాల్వ-శాకల్య-మద్రామ్బష్ఠ-పారసీకాది ప్రదేశాలు కలవు. భారతదేశం యొక్కవర్ణనం ఇంకా ఎక్కువగా బ్రహ్మపురాణంలో ఉన్నది.
--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు


ప్రస్తావవిషయం-3 విషయం- దీపోత్సవం

 🎀 *ప్రస్తావ-పారిజాతః- 3*🎁
*ప్రస్తావ పారిజాతం-3*
--------------------------
✳ ప్రస్తావవిషయః - దీపోత్సవః 🔆
విషయం- దీపోత్సవం
🌷

సంస్కృతరచన- సంకా ఉషారాణి
తెలుగు అనువాదం- పులిపాక వేంకట లక్ష్మీకాంత రావు
    దీపానామ్ ఆవలిః దీపావలిః। న కేవలం మిష్టాన్నఖాదనాయ, అపి తు, ధర్మస్య అధర్మోపరి విజయస్య స్మరణాయాపి ఇదం పర్వ। త్రేతాయుగే శ్రీరామస్య రావణోపరి విజయం సంస్మరన్తః వయం సర్వే అద్యాపి దీపాన్ దీపయిత్వా, విస్ఫులిఙ్గాన్ చ ప్రజ్వాల్య నన్దామః।
    కిన్తు ఆధునికే కాలే కేచన ఆగత్య పర్వణి అస్మిన్ జ్వాల్యమానైః విస్ఫోటనపదార్థైః వాయుకాలుష్యం వర్ధతే, ధ్వనికాలుష్యమపి జాయతే ఇతి దుష్ప్రచారం కుర్వన్తి। తన్న సత్యమ్। తదధికం కాలుష్యం నానావిధ-పేట్రోల్-వాహనైః ప్రతిదినం సంవర్ధ్యతే। ఫేక్టరీ-ఇత్యాదిభిః నిస్సృతేన కలుషితధూమేన, ద్రవేణ చ ప్రతిదినం జల-స్థల-కాలుష్యం సమ్పద్యతే। స్ఫోటకపదార్థాత్ యః ధూమః నిర్గచ్ఛతి తేన కృమికీటకాదయః మ్రియన్తే।
    అస్మిన్ విషయే అధికః సమాచారః అత్ర లభ్యతే (మమ సంస్కృతభ్రాత్రా ప్రేషితమ్)।
    http://growingindia.org/2016/10/31/diwali-fireworks-facts-and-numbers/
    అతః నిస్సఙ్కోచం వయం దీపావల్యుత్సవం కుర్మః। శివకాశ్యాం అన్యత్ర భారతే చ స్ఫులిఙ్గకారకాః విస్ఫోటకాః సజ్జీక్రియన్తే।
    తేషాం క్రయణేన భారతదేశస్య ఆర్థికాభివృద్ధిః భవతి। చీనదేశవస్తూని క్రీణీమః చేత్ తద్దేశస్యాభివృద్ధిః భవతి। అతః సదా స్వదేశీయవస్తూన్యేవ క్రీణీమః। వయం సర్వే అస్మిన్ దినే సైనికాన్ అపి నమామః, యే పరిసరభూమౌ స్థిత్వా దేశరక్షణం కుర్వన్తి, శత్రుహననాయ వాస్తవస్ఫోటకాన్ ప్రజ్వాల్య నిత్యదీపావలిం ఆచరన్తి॥
--సంకా ఉషారాణి
----------------------------------------
ప్రస్తావ విషయం-దీపోత్సవం
    దీపముల యొక్క వరుస దీపావళి. కేవలం మృష్టాన్న భోజనాలకే కాక, అధర్మం పైన ధర్మము యొక్క విజయాన్ని గుర్తు చేసుకోవటానికి కూడా ఈ పండుగ. త్రేతాయుగంలో రావణుని పైన శ్రీరాముడి యొక్క విజయాన్ని గుర్తు
చేసుకుంటూ మనమందరం ఈనాటికీ దీపాలను వెలిగించి, బాణసంచాను పేలుస్తూ ఆనందిస్తాము.
    కానీ ఆధునిక కాలంలో కొందరు వచ్చి ఈ పండుగలో వెలిగించే ప్రేలుడు పదార్థాల వల్ల వాయు కాలుష్యము పెరుగుతుంది, ధ్వని కాలుష్యం కూడా పెరుగుతుంది అని దుష్ప్రచారం చేస్తుంటారు. అది నిజం కాదు. దానికంటే ఎక్కువ కాలుష్యం నానా రకాల పెట్రోలు వాహనాల వల్ల ప్రతిరోజూ ప్రబలుతున్నది. కర్మాగారాలు మొదలైన వాటి వల్ల విసర్జించబడే కలుషితమైన పొగ, ద్రవాల వల్ల ప్రతిరోజూ జల స్థల కాలుష్యం కలుగుతున్నది. పేలుడు పదార్థాల వల్ల వచ్చే పొగతో క్రిమి కీటకాలు నశిస్తాయి.
    ఈ విషయంలో అధిక సమాచారం ఇక్కడ లభిస్తుంది.(నా సంస్కృత సోదరనిచే పంపబడింది).
    http://growingindia.org/2016/10/31/diwali-fireworks-facts-and-numbers/
కాబట్టి నిస్సంకోచంగా మనం దీపావళి పండుగను చేసుకుందాం. శివకాశిలో ఇంకా భారతదేశంలో ఇతర ప్రదేశాలలో కూడా బాణసంచా తయారు చేసే వారు ప్రేలుడు పదార్థాలను తయారు చేస్తుంటారు.
    వాటిని కొనటం వల్ల భారత దేశం యొక్క ఆర్ధికాభివృద్ధి జరుగుతుంది. చీనా దేశ వస్తువులను కొంటే ఆ దేశం యొక్క అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి మనం అందరం స్వదేశీయ వస్తువులనే కొందాము. మనం అందరం ఈ రోజు ఎవరైతే సరి హద్దు ప్రదేశాలలో నిలిచి దేశాన్ని రక్షిస్తూ నిజమైన ప్రేలుడు పదార్థాలతో నిత్య దీపావళి జరుపుతున్నారో ఆ సైనికులకు కూడా వందనం చేద్దాము.
-- పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు

ప్రస్తావపారిజాతం -2 విషయం- దేవవాణి (సంస్కృతం)

🎀 *ప్రస్తావ-పారిజాతః- 2*🎁

*ప్రస్తావ పారిజాతం-2*

--------------------------

విషయః - దేవవాణీ (సంస్కృతమ్) 🔆

విషయం-దేవవాణి (సంస్కృతం)

🌷

సంస్కృతరచన- సంకా ఉషారాణి

తెలుగు అనువాదం- పులిపాక వేంకట లక్ష్మీకాంత రావు

          సంస్కృతం దేవవాణీ ఇత్యపి నామ్నా ప్రసిద్ధా। దేవానాం భాషా, అథవా దేవైః సహ వక్తుముచితా భాషా ఇతి న తదర్థః। సంస్కృతభాషాయాః జ్ఞానేన ఉచ్చారణేన చ మానవః దేవసన్నిభః భవతి।

          దీర్ఘకాలం సంస్కృతశబ్దోచ్చారణేన మేధా వర్ధతే, స్మరణశక్తిశ్చ ప్రవర్ధతే। మన్త్రాణాం తన్త్రాణాం చ భాషా ఏషా మానవసృష్టేః ఉపయుక్తాన్ మహోన్నతవిషయాన్ స్వస్యాం ధారయతి। సంస్కృతేన సంయుక్తో భారతీయతయా సమ్బద్ధో భవతి భారతీయః।

          ప్రాచీనతమేయం భాషా విశ్వస్య ప్రాచీనతమపుస్తకస్య ఋగ్వేదస్య భాషా। వేద-శాస్త్ర-పురాణాది-భారతీయ-వాఙ్మయస్య భాషైషా భారతే సరస్వతీనదీవ సర్వభారతీయభాషాసు అన్తర్గతశక్తిః భూత్వా ప్రవాహశీలా అస్తి అద్యాపి। రామాయణ-మహాభారతాది-గ్రన్థానాం సరసా సుగమా భాషా, లౌకికమహాకావ్యేషు సమాసభూయిష్ఠా సుకఠినా భాషాపి ఏషైవ।

          దేవవాణ్యాః కఞ్చిత్కాలం శ్రవణేన, ఉచ్చైః పఠనేన, ఆధ్యానేన, లేఖనేన వా అలౌకికీ కాచిత్ శాన్తిః, పరమః కశ్చన ఆనన్దః, అసమానః చిత్తప్రసాదశ్చ ప్రాప్యతే ఇతి సంస్కృతాధ్యేతౄణాం సాక్షాదనుభవః। అస్యాః దేవత్వస్య చిహ్నమిదమేవ।

          న కేవలం భారతీయాః, అపి తు వైదేశికా అపి సకృచ్ఛ్రవణేన సంస్కృతభాషానురాగిణో భూత్వా భారతం ప్రతి ధావన్తి । అస్యాం భాషాయామేవ రచితాని వ్యాకరణ-న్యాయ-మీమాంసాది-శాస్త్రాణి నిర్ద్వన్ద్వమర్థం మనసి సంస్థాపయన్తి, విభేదం పరిఘ్నన్తి చ, పఠితుః హృదయే సుస్పష్టమర్థమావిష్కుర్వన్తి।

          వివిధ-ప్రాదేశిక-పణ్డితా అపి సంస్కృతభాషాయామేవ స్వీయకృతీః రచయన్తి స్మ పురా, ప్రాదేశిక-సీమ్నః అతిక్రమ్య తస్య కృతిః సమ్పూర్ణభారతే పఠ్యతామితి ధియా॥

--సంకా ఉషారాణి

----------------------------------------

ప్రస్తావ విషయం-దేవవాణి (సంస్కృతం)

          సంస్కృతము దేవవాణీ అనే పేరుతో కూడా ప్రసిద్ధమే. దేవతల యొక్క భాష లేక దేవతలతో మాట్లాడటానికి ఉచితమైన భాష అని దాని అర్థం. సంస్కృత భాషా జ్ఞానం మరియు ఉచ్చారణ వలన కూడా మానవులు దేవతలతో సమానులవుతారు.

          భారతీయతయా సమశబ్దాలను పలకటం చేత మేధస్సు వర్ధిల్లుతుంది జ్ఞాపక శక్తి కూడా ప్రవర్ధమానమవుతుంది. మంత్ర తంత్రాలతో కూడిన ఈ భాష మానవ సృష్టి కి ఉపయోగ కరమైన మహోన్నత విషయాలను కలిగి ఉన్నది. సంస్కృతంతో కలిసిన భారతీయత వలన భారతీయులు సమృద్ధంగా ఉంటారు.

          ప్రాచీనమైన భాష, విశ్వములో అతి ప్రాచీనమైన పుస్తకమైన ఋగ్వేదం యొక్క భాష, వేద శాస్త్ర పురాణాది భారతీయ వాజ్ఞ్మయం యొక్క భాష ఈ భారతములో సరస్వతీ నది వలె సకల భారతీయ భాషలందు అంతర్వాహినిగా నేటికీ ఉన్నది. రామాయణ మహాభారతాది గ్రంథాలయొక్క సరసమైన,సుగమమైన భాష, లౌకిక మహా కావ్యాలలో సమాస భూయిష్టమైన కఠిన మైన భాష కూడా ఇదే.

          దేవవాణిని కొంతకాలం వినటం వల్ల, బిగ్గరగా చదవటం వల్ల, అధ్యయనం చేయటం వల్ల, వ్రాయటం చేత కానీఏదో అలౌకికమైన శాంతి,ఏదో పరమానందం, అసమానమైన మనశ్శాంతి లభిస్తుంది అని సంస్కృతం అధ్యయనం చేసే వారి యొక్క స్వానుభవం. ఇదే దాని యొక్క దైవత్వ చిహ్నం.

          కేవలం భారతీయులే కాక విదేశీయులు కూడా ఒక్క సారి విన్నంత మాత్రాన సంస్కృత భాషా ప్రేమికులై భారత దేశం వైపు పరుగులెత్తుతున్నారు. ఈ భాష లోనే వ్రాయబడిన వ్యాకరణ, న్యాయ, మీమాంసాది శాస్త్రాల యొక్క అర్ధం

ద్వంద్వాలు లేకుండా మనసులో నిలుస్తుంది, భేదాలను నిర్మూలిస్తుంది. పఠితల హృదయాలలో చక్కని స్పష్టమైన అర్ధాన్ని ఆవిష్కరిస్తుంది.

          వివిధ ప్రాదేశిక పండితులు కూడా పూర్వం సంస్కృత భాషలోనే తమ కృతులను రచించేవారు, ప్రాదేశిక సీమలను దాటి వారి యొక్క కృతులు సంపూర్ణ భారతంలో పఠించచబడేవి.

--పులిపాక వేంకట లక్ష్మీకాంత రావు

ప్రస్తావ-పారిజాతం- 1 విషయం - జననీ - తల్లి

🎀ప్రస్తావ-పారిజాతః- 1🎁

ప్రస్తావ పారిజాతం-1

--------------------------

విషయః - జననీ 🙏

విషయం-జనని

🌷

సంస్కృతరచన- సంకా ఉషారాణి

తెలుగు అనువాదం- పులిపాక వేంకట లక్ష్మీకాంత రావు

          ఈశ్వరః న దృశ్యతే చర్మచక్షుర్భ్యామ్। లోకే సామాన్యమానవైః భగవతః ఉపస్థితిః సాక్షాన్నానుభూయతే। సః దయాలుః పిత్రోః రూపేణ భూమౌ వసతీతి విజ్ఞాః వదన్తి। తత్రాపి మాతృరూపేణ విశేషతః తిష్ఠతి సః। యా జన్మప్రభృతి అస్మాన్ పాలనపోషణాదికం కృత్వా ప్రేమ్ణా సంవర్ధయతి సా మాతా పరమపూజనీయా అస్మాభిః। తస్యాః వయం సర్వదా అధమర్ణాః ఏవ।

          మాతా సర్వసఙ్గపరిత్యాగినః సన్యాసినః అపి పూజ్యా। సా స్వార్థం విసృత్య స్వహితం అవిగణయ్య సర్వదా సన్తానస్య పాలనాయ, ప్రయోజనాయ ఏవ స్వజీవనం యాపయతి।

          ప్రసవసమయే, తదనన్తరమపి అత్యధిక-శరీరపీడాం సా సహతే। స్తన్యపానేన పోషయతి, సర్వాశుభైః రక్షతి। సన్తానస్య ఆనన్దే నన్దతి, దుఃఖే వ్యథితా భవతి। ప్రేమ్ణా లాలయన్తీ లోకవ్యవహారం, శుభాశుభం చ శిక్షయతి। అపరాధే కృతే ప్రథమం హితముపదిశతి। తదాపి అశ్రవణే కోపాత్ దణ్డయతి।

          యది కోఽపి సన్తానస్య అహితమాచరతి, తర్హి సా అపరిమితం క్రుద్ధా భూత్వా శపతే। న కేవలం మానవేషు, అపి తు జీవకోట్యాం సర్వప్రాణిషు మాతృషు ఇదం లక్షణం దృశ్యతే।

          వార్ధకే తస్యాః సేవా ఏవ పుత్రస్య పరమకర్తవ్యమ్। తస్యా పాదసంవాహనేన మనః తీర్థస్నానాచారణసమం శాన్తిం ప్రసన్నతాం చానుభవతి। తత్సేవాయాః పుణ్యకృతిర్నాన్యా లోకే॥

--సంకా ఉషారాణి

----------------------------------------

ప్రస్తావ విషయం-తల్లి

          ఈశ్వరుడు చర్మ చక్షువులకు గోచరించడు. లోకంలో సామాన్య మానవులకు భగవంతుని ఉనికి అనుభవానికి రాదు. ఆ దయామయుడు పితరుల రూపంతో భూమి మీద ఉంటాడని విజ్ఞులంటారు. అందునా విశేషంగా తల్లి రూపంతో ఆయన ఉంటాడు. ఎవరు పుట్టినది మొదలు మనలను పాలన పోషణాదులు చేసి పెంచి పెద్ద చేస్తుందో ఆ తల్లి మనకు పరమ పూజనీయురాలు. ఆమె ముందు మనమెప్పుడూ చిన్నవాళ్ళమే.

          తల్లి సర్వ సంగ పరిత్యాగిని సన్యాసిని అయినా కూడా పూజనీయురాలే. ఆమె స్వార్థం వదలి తన బాగు లెక్కచెయ్య కుండా ఎప్పుడూ సంతానాన్ని పోషించటం కోసం,వాళ్ళ ప్రయోజనం కోసం మాత్రమే తన జీవితం గడుపుతుంది.

          ప్రసవ సమయంలో, ఆ తరువాత కూడా విపరీతమైన శరీర బాధను ఆమె భరిస్తుంది. పాలిచ్చి పెంచుతుంది. అన్ని అశుభాల నుండి కాపాడుతుంది. సంతానం ఆనందిస్తే ఆనందిస్తుంది, దుఃఖిస్తే వ్యథ చెందుతుంది. ప్రేమతో లాలిస్తూ లోక వ్యవహారాలను, మంచీ చెడూ నేర్పుతుంది. తప్పు చేస్తే ముందు మంచిగా చెప్తుంది. అప్పుడు వినకపోతే కోపంతో దండిస్తుంది.

          ఒకవేళ ఎవరైనా తన సంతానానికి కీడుచేస్తే అప్పుడు ఆమె అంతులేని కోపంతో శపిస్తుంది.కేవలం మానవులలోనే కాదు జీవ కోట్లలో సర్వ ప్రాణులలో తల్లులలో ఈ లక్షణమే కనుపిస్తుంది.

          వార్ధక్యంలో ఆమె యొక్క సేవయే కొడుకు పరమ కర్తవ్యం. ఆమె పాదాలను ఒత్తుటంలోనే మనస్సు తీర్థ స్నానం చేసినదానితో సమానమైన శాంతి ప్రసన్నతలను పొందుతుంది. ఆ సేవ కన్నా పుణ్యకార్యం లోకంలో వేరే లేదు.

--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు

ప్రస్తావ పారిజాతం-20 విషయం -- చంద్రుడు

🎀 *ప్రస్తావ-పారిజాతః-20* 🎁 *ప్రస్తావ పారిజాతం-20 (సంస్కృతలేఖ - తెలుగు అనువాదం)* -------------------------- 🌷 సంస్కృతరచన- సంకా ఉషారాణి తెల...