🎀 *ప్రస్తావ-పారిజాతః-17* 🎁
*ప్రస్తావ పారిజాతం-17 (సంస్కృతలేఖ - తెలుగు అనువాదం)*
--------------------------
🌷
సంస్కృతరచన- సంకా ఉషారాణి
తెలుగు అనువాదం- పులిపాక వేంకట లక్ష్మీకాంత రావు
🌸
🌻ప్రస్తావవిషయః -- వివేకానన్దః; 🌺
సనాతనధర్మప్రచారకేషు, భారతీయతాయాః ప్రసారకేషు దేశవిదేశేషు విఖ్యాతం నామ వివేకానన్దస్య। అయం పురుషసింహః రామకృష్ణపరమహంసమ్ ఉపగమ్య, భగవద్దర్శనప్రాప్త్యా తుష్టః సన్ తస్య శిష్యత్వం స్వీకృతవాన్। బాల్యే నరేన్ద్రనామ్నా అభిహితోఽయం ఆగామినికాలే వివేకానన్ద ఇతి అఖిలవిశ్వస్మిన్ ప్రసిద్ధో జాతః। సాధుపుఙ్గవోఽయం వేదాన్తదర్శనస్య, యోగ-భక్తి-కర్మాదిమార్గాణాం చ సుష్టు వ్యాఖ్యానం కృతవాన్। అస్య ప్రవచనైః యువజనానాం హృదయాని అద్యాపి ఉల్లాసేన, ఉత్సాహేన చ పరిపుష్టాని భవన్తి। యే నిఃస్పృహయా, నిరీహతయా చ దుఃఖభాజనాని భూత్వా మనఃపీడామనుభవన్తి, తేఽపి అస్య వాణీం శ్రుత్వా పునః నూతనోత్తేజసా సమ్పన్నాః భూత్వా జీవనసమరాఙ్గణాయ సన్నద్ధాః భవన్తి। దేశసేవాయై, ధర్మసేవాయై చాయం మహాత్మా అవివాహితః అతిష్ఠత్। అన్నపానాదిరహితః, రోగాదినా పీడితోఽపి క్లేశాన్ సహమానః అనేకాన్ త్యాగాన్ కృతవాన్। అస్య శిష్యాః, అనుగామినశ్చ బహుషు దేశేషు సన్తి। అయమేవ రామకృష్ణామిశన్-ఇతి గురోః నామ్నా సంస్థామేకామారబ్ధవాన్। యుగపురుషస్యాస్య మహాత్మనః వివేకానన్దస్యోక్తీః, ప్రవచనాని చ అనేకపుస్తకేషు ప్రకాశితాః సన్తి। అస్య జీవనకథామధికృత్య కావ్యాన్యపి రచితాని॥
-సంకా ఉషారాణి
-----------------------------------------------
ప్రస్తావ విషయం- వివేకానందుడు
సనాతన ధర్మ ప్రచారకులలో దేశవిదేశాలలో విఖ్యాతమైన పేరు వివేకానందునిది. ఈ పురుషసింహుడు రామకృష్ణుని దగ్గరకు వెళ్లి భగవంతుని దర్శనం కలగటంతో సంతుష్టుడై ఆయన శిష్యరికాన్ని స్వీకరించాడు. బాల్యంలో నరేంద్రుడనే పేరుగలిగి తరువాత కాలంలో వివేకానందుడనే పేర అఖిల విశ్వంలో ప్రసిధ్ధుడైనాడు. సాధుపుంగవుడైన ఈయన వేదాంతదర్శనమును, యోగ-భక్తి-కర్మాది మార్గాలకు చక్కని వ్యాఖ్యానం చేశాడు. ఈయన ప్రవచనాలచేత యువత హృదయాలు ఈనాటికీ ఉల్లాసంతో ఉత్సాహంతో పరిపుష్టమౌతవి.ఎవరు నిస్పృహతో, కోరికలు లేకుండానూ, దుఃఖభాజనులై మనసులో బాధపడుతూ ఉంటరో వారు సైతం ఈయన మాటలను విని మళ్ళీ క్రొత్త ఉత్సాహంతో కూడి జీవన యుద్ధరంగంలో సన్నద్ధంగా ఉంటారు. దేశసేవ,ధర్మ సేవ కొరకు ఈ మహాత్ముడు అవివాహితుడుగా ఉన్నాడు. అన్నపానాలు లేకుండా,రోగాదులతో పీడించబడి, బాధలను సహిస్తూ ఎన్నో త్యాగాలు చేశాడు. ఈయన శిష్యులు, అనుయాయులు అనేక దేశాలలో ఉన్నారు. ఈయనే రామకృష్ణ మిషన్ అని గురువు పేర సంస్థనొక దానిని ఆరంభించారు. యుగపురుషుడైన ఈ మహాత్ముడు వివేకానందని ఉక్తులు, ప్రవచనాలూ అనేక పుస్తకాలలో ప్రకటించబడిఉన్నవి. ఈయన జీవిత కథను గురించి కావ్యాలు కూడా రచింపబడినాయి.
--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
వివిధ విషయాలపై చిన్న-పెద్ద సంస్కృతలేఖలు, తెలుగు అనువాదాలతో- భాష నేర్చుకునే ఉద్దేశ్యంతో.
Sunday, September 5, 2021
ప్రస్తావ పారిజాతం-17 విషయం -- వివేకానందుడు
Subscribe to:
Post Comments (Atom)
ప్రస్తావ పారిజాతం-20 విషయం -- చంద్రుడు
🎀 *ప్రస్తావ-పారిజాతః-20* 🎁 *ప్రస్తావ పారిజాతం-20 (సంస్కృతలేఖ - తెలుగు అనువాదం)* -------------------------- 🌷 సంస్కృతరచన- సంకా ఉషారాణి తెల...
-
🎀 *ప్రస్తావ-పారిజాతః-20* 🎁 *ప్రస్తావ పారిజాతం-20 (సంస్కృతలేఖ - తెలుగు అనువాదం)* -------------------------- 🌷 సంస్కృతరచన- సంకా ఉషారాణి తెల...
-
🎀 ప్రస్తావ-పారిజాతః-19 🎁 ప్రస్తావ పారిజాతం-19 (సంస్కృతలేఖ - తెలుగు అనువాదం) -------------------------- 🌷 రచన- సంస్కృతం -సంకా ఉషారాణి తెలు...
-
🎀 *ప్రస్తావ-పారిజాతః- 14* 🎁 *ప్రస్తావ పారిజాతం- 14 (సంస్కృతలేఖ - తెలుగు అనువాదం)* -------------------------- 🌷 సంస్కృతరచన- సంకా ఉషారాణి త...
No comments:
Post a Comment